
నాని, శ్రీనిథి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’. ఈ ఫ్రాంచైజీలో శైలేష్ కొలను రూపొందించిన మూడో చిత్రమిది. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించి మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు రాఘవ్ లిరిక్స్ అందించగా, అనిరుధ్ రవిచందర్ పాడిన తీరు ఆకట్టుకుంది.
‘తన కోసమే నా పొగరే మరి అణిగేనా.. తన కోసమే నా పరుగే ఇక ఆగేనా.. తనతోనే లోకమా.. తనతోనే ప్రేమా.. తనతోనేనా.. తను నాదేనా.. తన నవ్వేనా.. నిజమా తను నా నీడేనా.. మనసుకు తగునా..’ అంటూ డ్యూటీలో ఉన్న నాని తన ప్రేయసిని గుర్తుచేసుకుంటూ సాగిన ఈ పాట సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. పాట చివరిలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కలిసి రోజ్ ఫ్లవర్ ఇవ్వడం ఇంప్రెస్ చేసింది. ఇందులో నాని అర్జున్ సర్కార్ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.