శ్రీవిష్ణు శ్వాగ్ మూవీ నుంచి .. థర్డ్ లీరికల్ సాంగ్ రిలీజ్

శ్రీవిష్ణు శ్వాగ్ మూవీ నుంచి .. థర్డ్ లీరికల్ సాంగ్ రిలీజ్

శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా  హసిత్ గోలి రూపొందించిన చిత్రం ‘శ్వాగ్’.  ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలకు  మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం నాలుగో పాటను రిలీజ్ చేశారు.  రేవతి, భవభూమిల ప్రేమకథ అంటూ  మీరా జాస్మిన్, శ్రీవిష్ణు  వింటేజ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తూ సాగిన మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన పాటకు  ‘నీలో నోలో.. కదలాడు భావమీరాగం..  లోలో ఎదలో.. వినిపించ సాగే ఓ తాళం.. రేపటి కలనే చెలియా కందామా.. కమ్మని కబురే జతగా విందామా..’ అంటూ భువన చంద్ర రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి. 

రాజేష్​ కృష్ణన్, అంజన సౌమ్య కలిసి పాడారు. ఇందులో శ్రీవిష్ణు డిఫరెంట్ గెటప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. రీతూ వర్మ, దక్ష నగార్కర్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించగా, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్  4న విడుదల కానుంది.