తాత వస్తాడే.. వేళ్లు మడత వేస్తాడే

తాత వస్తాడే.. వేళ్లు మడత వేస్తాడే

కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన క్రేజీ మూవీ ‘భారతీయుడు 2’. వచ్చే నెలలో సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.   ఇప్పటికే రెండు పాటలను  రిలీజ్ చేయగా.. శుక్రవారం మూడో పాటను రిలీజ్ చేశారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్‌‌‌‌‌‌‌‌కు కాసర్ల శ్యామ్ తెలుగు లిరిక్స్ రాశాడు. అరుణ్ కౌండిన్య పాడాడు. ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే, చెదరగొట్టి పోతాడే.. తాత వస్తాడే.. తాటతీసి పోతాడే.. వేళ్లు మడత వేస్తాడే’ అంటూ సాగిన పాట ఆకట్టుకుంది.

అవినీతి జరిగినప్పుడు భారతీయుడు వచ్చి ఏం చేస్తాడో చెబుతూ.. సాగే పాటలో  సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేశారు.  కాజ‌‌‌‌‌‌‌‌ల్ అగ‌‌‌‌‌‌‌‌ర్వాల్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌.జె.సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్‌‌‌‌‌‌‌‌  మూవీస్ సంస్థలు  నిర్మిస్తున్నాయి. జులై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది.