- సిరీస్ చిక్కేనా
- రా. 7 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో లైవ్
నవీ ముంబై: తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ సాధించి రెండో పోరులో తడబడిన ఇండియా విమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 సవాల్‌కు సిద్ధమైంది. ఆసీస్‌పై తొలిసారి టీ20 సిరీస్ గెలిచే అవకాశం ఊరిస్తుండగా మంగళవారం జరిగే మూడో, చివరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లూ 1–1తో సమంగా ఉండగా.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ముంగిట వరల్డ్ చాంపియన్స్ ఆసీస్‌ను ఓడిస్తే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో హోమ్ టీమ్ ఆత్మవిశ్వాసం పెరగనుంది. అది జరగాలంటే ఇండియా అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. గత పోరులో తడబడిన బ్యాటర్లు పుంజుకోవాలి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ పేలవ ఫామ్ నుంచి బయటపడి ఈ మ్యాచ్‌లోనూ ముందుండి నడిపించాల్సి అవసరం ఉంది.