ట్రిపుల్ ఆర్ సౌత్ డీపీఆర్​కు మూడోసారి టెండర్

  •  
  • ఇటీవల జారీ చేసిన టెండర్​ను రద్దు చేసిన ఆర్ అండ్ బీ
  • వచ్చే నెల 10 వరకు గడువు
  • మరింత లేట్ కానున్న సౌత్ పార్ట్

హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్​ఆర్​) సౌత్ పార్ట్ డీపీఆర్ ప్రిపరేషన్ కు ఆర్ అండ్ బీ (ఎన్ హెచ్) వింగ్ మూడోసారి టెండర్లు పిలిచింది. గతేడాది నవంబర్ లో మొదటి సారి టెండర్లు పిలిచినప్పుడు ఒక్కటి కూడా రాకపోవటంతో రెండో సారి గత నెల చివరలో పిలిచారు. టెండర్ దాఖలుకు ఈనెల 20 వరకు గడువు విధించారు. తాజాగా రెండో టెండర్ ను రద్దు చేసి మూడో సారి టెండర్ ను అధికారులు పిలిచారు. టెండర్ దాఖలు చేసేందుకు వచ్చే నెల 10 వరకు గడువు విధించారు.

కాగా రెండో సారి టెండర్ లో పలు మార్పులు చేశామని అధికారులు చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ సంగారెడ్డి నుంచి ప్రారంభమయ్యి ఆమన్‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌ –-షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌– -చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ వరకు189.20 కి.మీ విస్తీర్ణంలో నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఫ్యూచర్ సిటీలను కనెక్ట్ చేసేలా సౌత్ పార్ట్ ను నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ, ఇటీవల కేంద్రమే దానిని నిర్మించాలని కోరుతూ లేఖ రాసింది.  

నార్త్ స్పీడ్.. సౌత్ స్లో

నార్త్ పార్ట్ టెండర్ దాఖలుకు ఫిబ్రవరి14 వరకు కేంద్రం గడువు విధించింది. మార్చ్ లో పనులు ప్రారంభించే అవకాశాలు కనపిస్తున్నాయి. 2 ఏండ్లలో పనులు పూర్తి చేయాలని టెండర్ లో కేంద్రం పేర్కొంది. సౌత్ పార్ట్ పనులు ప్రారంభించేందుకు కనీసం ఏడాది పడుతుందని అధికారులు చెబుతున్నారు. నార్త్ పనులు సార్ట్ అయి సౌత్ పనులు స్టార్ట్ కాకపోతే ప్రాజెక్ట్ కాస్ట్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.