బిగ్ బాస్ సీజన్7లో మూడో వారం ఎలిమినేషన్‌.. ఈ ఇద్దరిలో ఎవరు?

బిగ్ బాస్ సీజన్7(Bigg boss season7)లో మూడో వారం ఎలిమినేషన్‌కు సమయం వచ్చేసింది. గడిచిన రెండు వారాలలో కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అవగా.. మూడోవారం ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

నిజానికి మూడో వారం ఆటలో చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వారం వీక్ కంటెస్టెంట్ అనుకున్నవారు స్ట్రాంగ్ అయ్యారు. అందులో యావర్‌ ఒకడు. మొన్న జరిగిన టాస్క్ లో తన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. కంటెస్టెంట్స్ ఎంతలా డిస్టర్బ్ చేస్తున్నా.. పట్టువదలకుండా తానూ అనుకున్నది సాధించాడు. దీంతో అతని గ్రాఫ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అయితే అంతనికున్న టూమచ్ అగ్రేషన్ అనేది మైనస్ గా మారుతోంది. కానీ ఈ వారం ఎలిమినేషన్ లో యావర్ కు ఎం ప్రాబ్లమ్ లేదు. 

ఇక అమర్ దీప్, గౌతమ్ కృష్ణకు కూడా ఓటింగ్ బాగానే పడుతోంది. ఇక మిగిలింది లేడీ కంటెస్టెంట్స్.. ప్రియాంక, దామిని, శుభ శ్రీ, రతికలు. ఈ నలుగురిలో చూసుకుంటే.. దామిని, శుభ శ్రీలకు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఇద్దరికీ తక్కువ ఓట్లు వస్తన్నాయి. దామినీ మెయిన్ గా యావర్‌ను టార్గెట్ చేయడం వల్ల తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకుంది. దీంతో జనాలు ఆమెను డేంజర్ జోన్ లో పెట్టేశారు. ఇక ఈ ఇద్దరిలో చూసుకుంటే శుభశ్రీ గ్రాఫ్ కాస్త బెటర్ గా ఉంది. కాబట్టి.. మూడోవారం హౌస్ నుండి దామిని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.మరి చివర్లో బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి.