బాక్సాఫీస్ దగ్గర సందడే సందడి

బాక్సాఫీస్ దగ్గర సందడే సందడి

హైదరాబాద్: కరోనా పరిస్థితుల రీత్యా భారీ బడ్జెట్‌ సినిమాలు వాయిదా పడినా.. చిన్న సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ ఫిల్మ్స్ మార్చిలో విడుదల కానుండటంతో చిన్న సినిమాలు రిలీజ్ కు క్యూ కట్టాయి. ఈ వారం ఏకంగా 13 సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న సన్నాఫ్ ఇండియా కూడా ఉంది. బాక్సాఫీసు డే రోజు విడుదలవుతున్న సినిమాలేంటో తెలుసుకుందాం.. 

సన్నాఫ్ ఇండియా 

మోహన్ బాబు, శ్రీకాంత్, మీనా, ప్రగ్యా, పోసాని తదితర తారాగణంతో తెరకెక్కిన మూవీ ‘సన్నాఫ్ ఇండియా’. ఈ మూవీని దర్శకుడు డైమండ్ రత్నబాబు తెరకెక్కించాడు. 

బడవ రాస్కెల్ 

ధనుంజయ, అమృతా అయ్యంగార్‌, తార, రఘు తదిరులు నటించిన మూవీ ‘బడవ రాస్కెల్’. ఈ సినిమాను గురు శంకర్‌ డైరెక్ట్‌ చేశాడు. 

విశ్వక్‌

అజరు కతుర్వాన్‌, డింపుల్‌ తదితర నటులు నటించిన విశ్వక్ మూవీ కూడా శుక్రవారం విడుదల కానుంది. వేణు ముల్కాక దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

సురభి 70 ఎం.ఎం

అక్షత శ్రీనివాస్‌, వినోద్‌ అనిల్‌, చందు, మహేశ్‌ తదితరులు నటించిన సురభి 70 ఎంఎం చిత్రం కూ ఫిబ్రవరి 18న విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి గంగాధర వైకే అద్వైత దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలతోపాటు గోల్‌మాల్‌, 'వర్జిన్‌ స్టోరీ', 'నీకు నాకు పెళ్లంట', బ్యాచ్, రోమన్, స్వాతి చినుకు సంధ్య వేళలో, ఆర్జీవీ మిస్సింగ్, మాతృదేవోభవ, పల్లె గూటికి పండగొచ్చింది చిత్రాలు కూడా శుక్రవారం రిలీజ్ అవ్వనున్నాయి. అలాగే జుగ్ జుగ్ జియో అనే హిందీ చిత్రం కూడా ప్రేక్షకులన పలకరించనుంది. ఇక తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై ఈనెల 24న రిలీజ్ కానుండగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబోలో వస్తున్న భీమ్లా నాయక్ 25న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. వరుణ్ తేజ్ నటించిన గని కూడా ఇదే తేదీన రిలీజ్ అవ్వనుంది.

మరిన్ని వార్తల కోసం:

రూ.100 కోట్లతో ఐటీ టవర్స్కు శంకుస్థాపన

మైనస్ డిగ్రీల టెంపరేచర్లో జవాన్ల పెట్రోలింగ్

ప్రముఖ కమెడియన్ ప్రదీప్ మృతి