భారీగా తరలివచ్చిన భక్తులు
గద్దెలను శుద్ధి చేసిన పూజారులు
జాతర ముగిసినట్టు ప్రకటన
జయశంకర్ భూపాలపల్లి: మేడారం మహాజాతరలో చివరి ఘట్టమైన తిరుగువారం పండుగను ఇవాళ నిర్వహించారు. పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటికి పూజారులు తాళాలు వేశారు. సమ్మక్క, సారలమ్మ ఉత్సవాలు మండమెలిగే పండుగతో ప్రారంభమై.. తిరుగువారంతో ముగిశాయి. తిరిగి వచ్చే ఏడాది మాఘమాసంలో మినీ జాతర సందర్భంగా సామగ్రిని బయటకు తీసి పూజలు చేయనున్నారు.
ALSO READ :- అరకు కాఫీపై చంద్రబాబు, భువనేశ్వరి ట్వీట్లు వైరల్..!
ఈ ఏడాది ఈ నెల 7న మండమెలిగే పండుగతో జాతరను ప్రారంభించారు. 21న వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దిరాజు, గోవిందరాజు గద్దెలపైకి వేంచేసి భక్తులకు దర్శనం ఇచ్చారు. 4 రోజుల అనంతరం ఫిబ్రవరి 24న శనివారం వన ప్రవేశం చేశారు. ఇవాళ తిరుగువారంతో ఉత్సవాలు పూర్తయ్యాయి. తిరుగువారం సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది.