తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

కేరళలోని తిరువనంతపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి.  ఆదివారం(ఏప్రిల్27)  బాంబు పెట్టామని బెదిరిస్తూ ఈ మెయిల్స్ పంపారు గుర్తుతెలియిన దుండగులు. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు. బాంబు స్వ్కాడ్ బృందాలను రంగంలోకి దింపారు. అన్ని టెర్మినల్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

కేరళ రాజధాని తిరువనంతపురం లోని పలు హోటళ్లకు శనివారం బాంబులు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈమెయిల్స్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, బాంబు స్వ్కాడ్స్ , డాగ్ స్క్వాడ్స్ సంయుక్తంగా అన్ని హోటళ్లలో సోదాలు చేశారు. ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు. 

►ALSO READ | తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు..ఎండవేడిమికి వరికోత మిషన్ దగ్ధం

గత కొన్ని రోజులుగా కేరళను ఈమెయిల్స్ బెదిరింపులు కుదిపేస్తున్నరాయి. జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, కేరళ హైకోర్టు, రాష్ట్రంలోని  ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే పోలీసుల తనిఖీల్లో ఎటువంటి బాంబులకు సంబంధించిన పదార్థాలు దొరకలేదు.
బాంబు బెదిరింపు కాల్స్ పై దర్యాప్తు జరుగుతోంది.. ఎటువంటి భయంలేదు.. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరుస బెదిరింపు మెయిల్స్ వస్తుండటంతో తిరువనంతపురం అంతటా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.