బీఈడీ ఎస్జీటీలను పీఎస్​హెచ్​ఎంకు అర్హులుగా చేయండి

హైదరాబాద్, వెలుగు: బీఈడీ అర్హతతో ఎస్జీటీలుగా ఉన్న టీచర్లను ప్రైమరీ స్కూల్​ హెడ్ మాస్టర్​ (పీఎస్​హెచ్ఎం) పోస్టులకు అర్హులుగా ప్రకటించేలా రూల్స్  మార్చాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్ ) విజ్ఞప్తి చేసింది. 
 
ఈ దిశగా ఎన్​సీటీఈకి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. శనివారం శంషాబాద్​లో మంత్రిని కలిసి టీపీయూఎస్ ​అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు హన్మంతరావు, నవా త్​ సురేశ్​ వినతిపత్రం సమర్పించా రు. 2010 కన్నా ముం దు బీఈడీ అర్హతతో ఎస్జీటీలుగా ఉన్న టీచర్లను పీఎస్​హెచ్ఎం పోస్టు లకు అర్హులుగా ప్రకటించాలన్నారు.