జమ్మూ కాశ్మీర్‌లో ఈ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం.. ఎందుకంటే?

జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్పెషల్ స్టేటస్(ఆర్టికల్ 370) రద్దు చేసిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటి సారి. అందుకే ఈ ఎన్నికలు ఇండియా, పాక్ బార్డర్ అయిన J&K లో చాలా కీలకం. జమ్మూ కాశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 

దేశ భద్రత దృష్ట్యా ఆ ప్రాంతం చాలా సున్నితమైంది. గత రెండుమూడు నెలలుగా తరుచూ అక్కడ ఉగ్రదాడులు జరుతున్నాయి. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో AAP అభ్యర్థులను ఖరారు చేసింది. పుల్వామా, రాజ్‌పురా, దేవ్‌సర్, డోరు, దొడ, దొడ వెస్ట్, బనీహాల్ స్థానాల్లో బరిలో దిగుతున్న నాయకులు పేర్లను ఆప్ ప్రకటించింది. 

ALSO READ | మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు: కేంద్ర ఎన్నికల సంఘం

2018కి ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా PDP,-BJP సంకీర్ణ ప్రభుత్వం ఉంది. అయితే బీజేపీ పార్టీ వైదొలగడంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో 2018  జూన్ లో జమ్ముకాశ్మీర్ లో అసెంబ్లీ రద్దు చేసి గవర్నర్ పాలన విధించారు అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్. 2019  ఆగస్ట్ 5న ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వర్తింపజేసే ఆర్టికల్ 370ని రద్దు చేసింది ఇండియన్ గవర్నమెంట్. తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌ను జమ్మూ, లద్డాక్  రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించించి.