AI దెబ్బకు.. కోడింగ్ ఉద్యోగాలను క్లోజ్ చేసిన టెక్ కంపెనీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో ఉద్యోగాలు పోతాయి.. పోతాయి అని ఈ కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది గగ్గోలు పెడుతూ వస్తున్నారు. అయితే ఓ కంపెనీ అన్నంత పని చేసింది. ఏఐ తో ప్రొడక్టివిటీ చాలా పెరిగిందనీ.. అందుకు ఏఐ ని మరింతగా వినియోగించాలని డిసైడ్ అయ్యామని ప్రకటించింది. ఫలితంగా ఈ 2024 లో కొత్త ఉద్యోగులను తీసుకోవడం ఆపేశామని ప్రకటించింది. ఏఐ దెబ్బకు ఉద్యోగాలను తీసుకోవడమే మానేశారంటే.. ఈ కృత్రిమ మేధపై ఎంత నమ్మకం ఏర్పడిందో చూడండి.

సేల్స్ఫోర్స్ (Salesforce) అనే క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ.. 2024 లో కొత్త ఎంప్లాయిస్ ను, కోడర్స్ ను తీసుకోవడం ఆపేసినట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 30 శాతం ప్రొడక్టివిటీ సాధించామని, ఎంప్లాయిస్ లేకుండా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని కంపెనీ సీఈఓ మార్క్ బెనియాఫ్ తెలిపారు. ఏఐ వినియోగం కంపెనీ ఇంజినీరింగ్ టీమ్ పై చాలా ప్రభావం చూపిందని, ఏఐ టూల్స్ తో ఊహించని ఫలితాలు రావడంతో ఎంప్లాయిస్ హైరింగ్ ఆపేశామని తెలిపారు. కొత్త నియామకాలు లేకుండా 1000 నుంచి 2000 సేల్స్ ను తక్కువ టైం లో పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు గెలిపారు. 

ఏఐ వర్క్ విషయంలో సహాయం చేస్తుంది.. తక్కువ టైం లో ఎక్కువ ప్రొడక్టివిటీకి ఉపయోగపడుతుంది కానీ జాబ్స్ ను రీప్లేస్ చేయదని సేల్స్ ఫోర్స్ (ఇండియా) సీఈఓ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఎంప్లాయిస్ ఇచ్చే టాస్క్ ను సమర్ధవంతంగా నిర్విర్తిస్తుందని తెలిపారు. కంపెనీలకు ఎంప్లాయిస్ భారం కాకుండా తక్కువ ఎంప్లాయిస్ తో ఎక్కువ ఔట్ పుట్ ఇవ్వడంలో ఏఐ బెస్ట్ ఛాయిస్ అని తెలిపారు.