వాట్సాప్ ఛానెల్స్ అనేది వాట్సాప్ లో ఇటీవల ప్రారంభించిన మరో కొత్త ఫీచర్. ఈ ఛానెల్‌లు పబ్లిక్ ప్రొఫైల్‌లు, ప్రభుత్వ వ్యక్తులు, ప్రముఖులు, సంస్థలు.. వాట్సాప్ ద్వారా టెక్స్ట్, ఫోటోలు, లాంటి సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగించే ఒక ప్రసార సాధనం. దీన్ని ప్రారంభించిన వారాల్లోనే, అనేక మంది పబ్లిక్ ఫిగర్లు ప్రసార ప్లాట్‌ఫారమ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించారు. ప్రస్తుతం వాట్సాప్ ఛానెల్‌లలో అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీ బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్.
వాట్సాప్ ఛానెల్‌లలో అత్యధికంగా ఫాలో అవుతున్న సెలబ్రిటీ
వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించిన కేవలం రెండు వారాల్లోనే కత్రికా కైఫ్ కు 14.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా అనుసరించే ఖాతాలలో ఆమెది నాల్గవది. అయితే ఆమె పైన ఉన్న మూడు సంస్థలు వాట్సాప్ (WhatsApp), నెట్ ఫ్లిక్స్ (Netflix), రియల్ మాడ్రిడ్(Real Madrid FC). వ్యక్తులలో మాత్రం ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువగా కత్రినా కైఫ్ కు ఫాలోవర్లు ఉన్నారు.
ALSO READ: ఇండియా or చైనా?.. Apple iPhone 15లో రహస్యంగా ఏమి రాయబడింది..
వాట్సాప్ ఛానెల్స్‌లో కత్రినా కైఫ్‌కు భారీ ఫాలోవర్లు
ఈ రేసులో కత్రినా తర్వాతి స్థానంలో అమెరికన్ రాపర్ బాడ్ బన్నీ ఉన్నాడు, అతనికి 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 9.6 మిలియన్లతో తదుపరి స్థానంలో ఉండగా, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ - 8.3 మిలియన్లతో 4వ స్థానంలో ఉన్నారు. 7.1 మిలియన్ల మంది ఫాలోవర్లతో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో అధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఇతర ప్రముఖులు ఒలివియా రోడ్రిగో, దిల్జిత్ దోసాంజ్, సన్నీ లియోన్, నాస్, మోనాలిసా, మోహన్‌లాల్.