షాద్నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ బాలుడు సహసం చేసి ఏకంగా 50 మంది ప్రాణాలను కాపాడాడు. స్థానికంగా ఉండే సాయిచరణ్ అనే ఓ బాలుడు మంటలను గమనించి అక్కడికి వెళ్లి భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహయంతో బిల్డింగ్ లోపల ఉన్న కార్మికులను కిందికి దిగారు. ఆ బాలుడు తాడు కట్టకపోయింటే కార్మికులు అందులోనే ఉండి సజీవదహమయ్యేవారు .
నందిగామ మండలంలోని అల్లెన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలామంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత ఆస్తినష్టం వివరాలు తెలిసే అవకాశముంది.