BSNL గేమ్ ఛేంజర్ ప్లాన్..రూ.800 రీచార్జ్తో 300 రోజుల వ్యాలిడిటీ..రోజుకు 2GB డేటా

BSNL గేమ్ ఛేంజర్ ప్లాన్..రూ.800 రీచార్జ్తో 300 రోజుల వ్యాలిడిటీ..రోజుకు 2GB డేటా

BSNL టెలికం మార్కెట్లో దూసుకుపోతుంది. అద్భుతమైన రీచార్జ్ ప్లాన్లతో కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ బినిఫిట్స్ అందిస్తోంది. జియో, ఎయిర్ టెల్ , ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ ప్రస్తు రీచార్జ్ ప్లాన్ల పెంచడంతో కస్టమర్లు క్రమంగా బీఎస్ ఎన్ ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ప్రభుత్వ రంగం టెలికం సంస్థ అనేక రీచార్జ్ ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా కొత్త 300 రోజులు రీచార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. 

BSNL రూ.797 ప్లాన్

ఎక్కువ కాలం పాటు సిమ్ యాక్టివ్గా ఉంచాలనుకునే కస్టమర్ల కోసం BSNL రూ. 797 రీచార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 800 రూపాయలలోపు 300 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ అందిస్తుంది. అయితే ఈ ప్లాన్లో మొదటి60 రోజులు పాటు ఉచిత కాల్స్, రోజుకు 2GB డేటా,100SMSలతో 120GB డేటాను అందిస్తుంది.

 ప్రారంభ 60 రోజుల తర్వాత వాయిస్ కాల్స్, ఎస్ ఎంఎస్ లు కొనసాగించాలనుకుండే టాప్ అప్ ప్లాన్లను ఎంచుకోవాలి. ఇంటర్నెట డేటా 300 రోజులు అందుబాటులో ఉంటుంది.. అయితే 60 రోజుల తర్వాత దాని వేగం 40kpbs కితగ్గుతుంది. 

BSNL ప్లాన్ గేంజర్ ప్లాన్.. 

BSNL రూ 797 ప్లాన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన దీర్ఘకాలిక ప్లాన్ లలో ఒకటి. సరసమైన ధరలో డేటా, కాల్ ప్రయోజనాలను అస్వాదిస్తూ సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్. jio, ఎయిర్ టెల్, ఐడియా ఖరీదైన రీచార్జ్ ప్లాన్ లతో విసిగిపోయిన కస్టమర్లను ఆకర్షించేందుకు BSNL ఈప్లాన్ ను ప్రవేశపెట్టింది.