
జియో, ఎయిర్టెల్, వీఐ లాంటి ప్రధాన టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ రేట్లు భారీగా పెంచిన క్రమంలో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఒకపక్క రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి రీఛార్జ్ భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం రూ. 2,398కే 14నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్.
ఈ కొత్త ప్లాన్ ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీతో, ఎక్కువ డేటాతో అన్ లిమిటెడ్ కాల్స్ తో వస్తోంది. తరచుగా రీఛార్జ్‌లతో విసిగిపోయిన వినియోగదారులకు మంచి ఆప్షన్ అనే చెప్పాలి.
వ్యాలిడిటీ, బెనిఫిట్స్:
రూ.2,398కే 425 రోజుల వాలిడితో వస్తున్న ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 14నెలల పాటు రీఛార్జ్ గురించి ఆలోచించే పని ఉండదు. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి:
అన్ లిమిటెడ్ కాలింగ్: భారతదేశం అంతటా అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్.
రోజువారీ డేటా: రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, మొత్తం 850GB. డైలీ లిమిట్ అయిపోయాక 40Kbps వేగంతో డేటా.
SMS బెనిఫిట్స్: రోజుకు 100 ఉచిత SMSలు.
జియో, ఎయిర్‌టెల్ మరియు Vi ప్లాన్‌ల పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న తాజా ఆఫర్ వినియోగదారులకు సరసమైన ధరకే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇస్తుంది.
ఈ ప్లాన్ ఎక్కడ వర్తిస్తుంది:
ప్రస్తుతం, ఈ రీఛార్జ్ ప్లాన్ జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుందో లేదో క్లారిటీ లేదు. అయితే, లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ప్రైవేట్ టెలికాం దిగ్గజాలతో పోటీ పడటానికి బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.
ALSO READ | న్యూ ఇండియా బ్యాంక్ ఫ్రాడ్: రూ.122 కోట్ల ఫండ్ను ఎలా నొక్కేశారంటే..