Nigeria hunger crisis: ఏంటీ ఘోరం..29 మంది పిల్లలకు ఉరిశిక్షా!

Nigeria hunger crisis: ఏంటీ ఘోరం..29 మంది పిల్లలకు ఉరిశిక్షా!

ఏంటీ ఘోరం..తిండిలేక ఆకలితో చచ్చిపోతున్నాం అన్నందుకు జైల్లో పెడతారా..ఉద్యోగాలు లేవు..ఉపాధి లేదు.. కల్పించండి అని నిలదీస్తే కాల్చి చంపుతారా.. మైనర్లు అన్న దయలేకుండా మరణశిక్ష విధిస్తారా.. అని నైజిరియా వార్త విన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం, ఆందోళన, ప్రశ్న తలెత్తక మానదు. 

నైజీరియాలో ఆహార నిల్వలు తగ్గి తిండిలేక జనాలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలుపుతున్న దారుణమైన దుస్థితి. అయితే అక్కడి ప్రభుత్వం నిరసనలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు పాల్పడు తోంది. ఆందోళనలో పాల్గొన్న వారికి ఏకంగా ఉరిశిక్షలు విధిస్తోంది..అందులో 14 యేళ్ల లోపు చిన్నారుల కూడా ఉన్నారంటే ఎంత దారుణ పరిస్థితి ఉందో తెలుస్తోంది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే..చిన్నారుల్లో నలుగురు ఆకలితో నిరసించి కోర్టులోనే కుప్పకూలిపోయారు. 

నైజిరియాలో రికార్డుస్థాయిలో పెరుగుతున్న జీవన వ్యయం సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నందుకు శుక్రవారం( నవంబర్ 2) 29 మంది చిన్నారులకు ఉరి శిక్ష వేసింది అక్కడిప్రభుత్వం. వారిలో నలుగురు కోర్టు మెట్లపైనే ఆకలితో నిరసించి కుప్పకూలిపోయారు. ఛార్జీ షీటులో మొత్తం 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం తో సహా పది నేరారోపణలతో కేసులుపెట్టారు. ఇందులో 29 మంది 14 యేళ్ల లోపు వారే. 

నైజిరియాలో దారిద్ర్యాం తాండవిస్తోంది. ఆఫ్రికాలో జనాభా ఎక్కువగా ఉన్న దేశమైన నైజిరియా ప్రజలకు తిండి దొరక్క ఊకుమ్మడి నిరసనలకు దారితీసింది. ఆగస్టులో యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కావాల్సిన కడుపునిండా తిండి దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల్లో 20 మంది యువకులు కాల్చిచంపబడ్డారు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. 

1970లో నైజిరియాలో మరణశిక్ష అమలులోకి వచ్చింది. అయితే  2016 నుంచి దేశంలో ఉరిశిక్షలు అమలు కాలేదు.. తాజాగా నిరసనలు ఉదృతం కావడడంతో మరోసారి మరణశిక్ష ప్రస్తావన వచ్చింది. 

ఉరిశిక్ష పడిన 29 మంది మైనర్లు.. అంతా 17 యేళ్ల లోపు వారే.. నైజిరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడం అనుమతించబడదని ’’ మైనర్ల తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన అక్కడి కోర్టు 5లక్షల పూచికత్తులో కఠినమైన ఆంక్షలతో బెయిల్ మంజూరు చేసింది. 

నైజిరియాలో ఎందుకీ సంక్షోభం.. 

ఆఫ్రికాలో ముడి చమురుకు ప్రసిద్ది నైజిరియా. అయినా ప్రపంచంలోనే అత్యంత పేద దేశం. దేశంలో రాజకీయ నేతలు, చట్టసభల్లో అవినీతి ఆరోపణలతో వార్తల్లో ఉంటుంది. ప్రభుత్వాధినేతలు, రాజకీయనేతలు, అధికారులు విలాసవంతమైన లైఫ్.. సామాన్య ప్రజలు ఆకలితో కేకలు నైజిరియాలో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసింది. 

నైజిరియాలో 21కోట్లకుపైగా జనాభా ఉంది.ఆఫ్రికా ఖండంలో అతిపెద్దది.ప్రపంచంలో అత్యంత ఆకలితో ఉన్న వారు కలిగిన దేశం. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అథారిటి నివేదిక ప్రకారం.. పశ్చిమాసియా దేశాల్లో తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్న దేశం. ఇక్కడి ప్రజలకు కనీసం ఒకపూట భోజనం దొరకని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి.