బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పరిశ్రమలను మోదీ గుజరాత్ కు తరలించుకుపోయార ఆరోపించారు. తమ ప్రశ్నకు సమాధానం చెప్పాకే ప్రధాని మోదీ ఇక్కడ అడుగుపెట్టాలని ఫైర్ అయ్యారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేశాకే ఇక్కడ అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాథూర్ తరలించుకు పోయారని బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదని తెలిపారు. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న వరంగల్ ను అనాథగా మార్చారని చెప్పారు రేవంత్ రెడ్డి.
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణకు ఏమీ చేయలేకపోవడంతోనే ప్రజలు బండకేసి కొట్టారని విమర్శించారు. కారు మళ్లా వచ్చుడు కాదు... జుమ్మెరాత్ బజార్ లో తూకానికి వేయడమేనని కామెంట్ చేశారు. మీరు దిగమంటే దిగడానికి కాంగ్రెస్ అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని ఫైర్ అయ్యారు. వరంగల్ మిర్చి అంటే ఎలా ఉంటుందో తెలుసుకదా అని అన్నారు.
కేసీఆర్ బస్సు యాత్ర దేనికని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీపై విమర్శలు ఎందుకు చేరడంలేదని నిలదీశారు.బిడ్డ బెయిల్ కోసం వరంగల్ సీటు తాకట్టు పెట్టిన చరిత్ర కేసీఆర్ దని ఆరోపించారు. తులసివనంలో గంజాయి మొక్క ఎర్రబెల్లి దయాకర్ రావు అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను దొంగదెబ్బ తీయాలని బీఆర్ఎస్ నాయుకుడ్ని బీజేపీలోకి పంపారని అన్నారు. లోక్ సభ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ అని ఇది ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని 13న జరిగే ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ యుద్ధంలో బీజేపీ ఓడించి కాకతీయ పౌరుషం చూపించాలని అన్నారు.