
నర్సాపూర్, వెలుగు : ఈ బాజా సే ఇండియా 2024 పేరిట నిర్వహిస్తున్న ఈ విద్యుత్ వాహనాల పోటీలను బీవీఆర్ఐటీ కాలేజ్ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణు రాజు మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న పోటీల్లో 2450 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారన్నారు.
ఫస్ట్ ప్రైస్ డీవై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆకుర్తి మహారాష్ట్ర, పింప్రీ చించువాండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెండో బహుమతి , శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమవరం మూడో బహుమతి పొందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీవీఆర్ఐటీ ప్రిన్సిపల్ సంజయ్ దూబే, సొసైటీ కార్యదర్శి ఆదిత్య విస్సమ్, ఇతర రాష్ట్రాల ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.