
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి.. ఇండియా, పాకిస్తాన్ మధ్య తెగతెంపుల తర్వాత.. అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇండియాలోని పాకిస్తానీయులు అందరూ వెళ్లిపోవాలనే ఆదేశాలు.. ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం తెలిసి ఇప్పుడు దేశం ఔరా అని ముక్కున వేలేసుకుంటోంది.. పాకిస్తాన్ దేశ పార్లమెంట్ కు ఎంపీగా ఎన్నికైన ఓ వ్యక్తి.. ఇప్పుడు ఇండియాలో రోడ్లపై.. సైకిల్ పై తిరుగుతూ ఐస్ క్రీంలు అమ్ముకుంటున్నాడు. ఇతని ఫ్యామిలీలో ఏకంగా మొత్తం 34 మంది ఉన్నారు.. వీళ్లల్లో ఆరుగురికి ఇండియా పౌరసత్వం కూడా ఉంది.
ఈ ఇప్పుడు మీడియాకు రావటంతో అందరూ షాక్ అవుతున్నారు. పాకిస్తాన్ ఎంపీ ఏంటీ.. ఇండియాలో రోడ్లపై ఐస్ క్రీం అమ్ముకోవటం ఏంటీ అని.. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అతని పేరు దబయ్ రాం. అతని వయస్సు 75 ఏళ్లు.. 1988లో బదయ్ రాం పాకిస్తాన్ దేశంలోని బఖర్ జిల్లా నుంచి ఎంపీగా అక్కడి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. అవును.. మీరు విన్నది నిజమే.. అంత పెద్ద హోదాలో ఉన్న బదయ్ రాం జీవితం ఆ తర్వాత తలకిందులు అయ్యింది.
పహల్గాం టెర్రర్ ఎటాక్ తర్వాత యావత్ దేశ ప్రజలు దాయాది పాకిస్థాన్‌పై భగ్గుమంటున్నారు. పహల్గాం ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉందని గుర్తించిన భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే దాయాది దేశానికి తగినబుద్ధి చెప్పాలని భారత్ కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టింది. ఈ మేరకు పాకిస్థాన్‌తో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. దీంతో పాటు పాక్ పౌరులకు మంజూరు చేసిన అన్నీ వీసాలను రద్దు చేసి.. 2025, ఏప్రిల్ 28లోపు దేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో 537 మంది తిరిగి పాక్‌కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ మాజీ ఎంపీ దబాయ్ రామ్ 36 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఇంకా హర్యానాలోనే ఉన్నారు. ఇందులో ఆరుగురికి భారత పౌరసత్వం లభించింది. మిగిలిన 28 మంది ఇండియా విడిచి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దబాయ్ రామ్ వ్యవహారంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఎవరీ దబాయ్ రామ్..?
పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో విభజనకు రెండు సంవత్సరాల ముందు దబాయ రామ్ జన్మించారు. 1947 తర్వాత భారత్ నుంచి పాక్ విడిచిపోయినప్పటికీ ఆయన పాకిస్థాన్‌లోనే స్థిరపడ్డారు. 1988లో రామ్ లోహియా, బఖర్ జిల్లాల నుంచి ఆయన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే.. పాక్‌లో దబాయ ఫ్యామిలీకి మతపరమైన సమస్యలు ఎదురయ్యాయి. మత తీవ్రవాదులు ఏకంగా దబాయ్ రామ్ కుటుంబంలోని ఓ మహిళను బలవంతంగా వివాహం చేసుకున్నారు. దీనిపై ఆయన పాక్ సుప్రీంకోర్టుకు వెళ్లగా ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన 2000 సంవత్సరంలో ఒక నెల వీసాపై కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు.
హర్యానాలోని రోహ్‌తక్‌కు రతన్‌గఢ్‌లో స్థిరపడ్డారు. అప్పటి నుంచి వీసా గడువును పొడగించుకుంటూ.. సైకిల్ రిక్షా ఐస్ క్రీంలు కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భారత వీసాకు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. దబాయ రామ్ ఫ్యామిలీలో మొత్తం 36 మంది ఉండగా.. ఇందులో ఆయనతో పాటు మరో ఐదుగురికి భారత పౌరసత్వం లభించింది. మిగిలిన 28 మంది సిటిజన్‌షిప్ అప్లికేషన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంతలోనే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించడంతో దాయాది దేశంపై కన్నెర్రజేసిన భారత ప్రభుత్వం.. పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
దీంతో దబాయ రామ్ ఫ్యామిలీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆరుగురికి మాత్రమే భారత పౌరసత్వం ఉండటంతో.. మిగిలిన 28 మంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మత వివక్ష కారణంగా పాక్ విడిచి వచ్చిన ఆయన కుటుంబంతో కలిసి దాదాపు 25 ఏండ్లుగా భారత్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతం హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో నివసిస్తున్న దబాయా రామ్ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారించారు. అనంతరం వారిని తిరిగి ఇంటికి తిరిగి పంపించారు. దీంతో దబాయ్ రామ్ కుటుంబ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. 36 మందిని భారత్ నుంచి బహిష్కరిస్తారా..? లేక ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇస్తారా..? అన్నది వేచి చూడాలి.