
గూగుల్ ఓపెన్ చేయగానే ఎడమవైపు పైన బీక (లాబొరేటరీలో ఉండే ఒక పరికరం) ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఫీచర్ మీద క్లిక్ చేస్తే ‘సెర్చ్ ల్యాబ్స్’ అనే ప్రాంప్ట్ వస్తుంది . ఈ ఫీచర్ ద్వారా కొత్త లేదా ఒరిజినల్ కంటెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. అందుకోసం ఇప్పటికే కావాల్సిన మోడల్స్, స్ట్రక్చర్స్ డాటాలో అందుబాటులో ఉంచారు. యూజర్లకు సెర్చ్ రిజల్ట్ అర్థం చేసుకునేందుకు వీలుగా వీడియోలు, ఫొటోల రూపంలో టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కూడా ఇస్తుంది.
ఈ ఫీచర్‌తో లోకల్ లాంగ్వేజెస్ టెక్స్ట్, విజువల్ రిజల్ట్స్ చూడొచ్చు. అందుకోసం గూగుల్ యూజర్లు ముందుగా జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. ఆ తర్వాత జీమెయిల్‌కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత టాప్ లెఫ్ట్‌లో ఉన్న బీక ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. అందులో ఏదైనా సెర్చ్ చేస్తే, దానికి సంబంధించిన విషయాలు కనిపిస్తాయి. దాని కింద స్క్రోలింగ్ ట్యాబ్స్‌లో ఆ టాపిక్‌కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటి మీద ట్యాప్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఏదైనా విషయాన్ని లోతుగా స్టడీ చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సెర్చ్ రిజల్ట్స్ పేజీలోని షార్ట్ వీడియోలు, ఫొటోలు, కన్వర్జేషన్స్ పై ఆధారపడి ఉంటాయి.