పెద్దల కోసం యాప్స్…

పెద్దల కోసం యాప్స్…

ఉదయం లేవగానే ఆఫీస్ టైం అయ్యిందనుకుంటూహడావుడి.. ఆఫీస్ కు వెళ్తే ఇంట్లో వాళ్లు ఏం చేస్తు న్నారో?ఆలోచించే టైం కూడా ఉండదు. మరి ఇలాంటి టైంలో ఇంట్లోఉండే పెద్దలకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా? వాళ్లకుఏదైనా తినాలి అనిపిస్తే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు కొన్నియాప్స్ సమాధానం ఇస్తున్నాయి. పెద్దవాళ్లకు ఉపయోగపడే ఎన్నో యాప్స్ .. ప్లే స్టో ర్ లేదంటే యాప్ స్టోర్ లో అందుబాటులోఉన్నాయి. కొంచెం టైం తీసుకొని.. వాటిని పెద్దవాళ్ల ఫోన్ లలోడౌన్ లోడ్ చేస్తే చాలు. ఇంట్లో ఎవరూ లేకపోయినా .. ఆ యాప్స్ హెల్ప్ ఫుల్ అవుతాయి.

వోచర్ క్లౌడ్

అన్ని ఫోన్లలో ఈ యాప్ పనిచేస్తుంది. బయటకు వెళ్లాలనుకునే పెద్దవాళ్లకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. రెస్టారెంట్లు , థియేటర్లు, గార్డెన్ సెంటర్లు, ఇతర ఔట్ లెట్లలోఆఫర్లు, ఓచర్లు, డిస్కౌంట్లు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. ఇలా ఎక్కడెక్కడ ఏయే ఆఫర్లున్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు.ఐబీపీ(బ్లడ్ ప్రెజర్)పెద్దవాళ్లలో బీపీ, షుగర్ లెవల్స్ఎప్పటికప్పుడు మారుతుంటాయి.వాటిని కంట్రోల్ లో ఉంచుకోవాలంటేమందులు వేసుకోవాలి. లేదంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.మొబైల్లో ‘ఐబీపీ’ యాప్ ఉంటేచాలు.. ప్రతిసారి డాక్టర్ దగ్గరికివెళ్లాల్సి న అవసరమే ఉండదు. బీపీతోపాటు షుగర్ లెవల్స్ ని ఇంట్లో ఉండేసొంతంగా చెక్ చేసుకోవచ్చు.

డ్రాగన్ డిక్టేషన్

ఆఫీసులో ఉన్న కొడుకు, కూతురుకోలేదంటే ఇంకెవరికైనా ఏదైనా మెసేజ్ పంపాలనుకునే పెద్దవాళ్లకు ఈ ౦ఏఏయాప్ఉపయోగపడుతుంది. టైపింగ్ ఇబ్బందులుఉండవు. టైప్ చేయాలనుకున్న సమాచారాన్ని ఈ యాప్ ఓపెన్ చేసి నిర్ణీత టైంలో చెప్తేచాలు.. మీ మాటలు అక్షరాలుగా ప్రత్యక్షమవుతాయి. దీంతో ఆ మెసేజ్ ని కావాల్సినవాళ్లకు పంపించవచ్చు. అయితే, ప్రస్తుతంఈ యాప్ ఇంగ్లిష్ లో మాత్రమే ఉంది. కొన్నిభాషల్లో ట్రయల్ రన్ జరుగుతోంది.

వెబ్ ఎండీ

ఇది వెబ్ ట్ కి సంబంధించిన యాప్. ఆరోగ్యానికిసంబంధించిన ఎలాంటిసందేహాలైనా, సమాచారమైనా ఈ యాప్ అందిస్తుంది. హెల్త్ టిప్స్, సలహాలులాంటివి ఈ యాప్ ద్వారాపొందొచ్చు. దీని కోసం చేయాల్సిం దల్లా.. యాప్ఓపెన్ చేసి కావాల్సిం దిసెలక్ట్ చేసుకోవడమే.

విజ్ విజ్

పెద్దవాళ్లకు స్మార్ట్ ఫోన్ ను వాడటం గురించి పెద్దగాతెలిసినా.. పూర్తిగా తెలిసే అవకాశం చాలా తక్కువ.ఏదైనా బ్రౌజ్ చేయాలన్నా.. ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా వాళ్లకు ఇబ్బందే. అయితే, ఈ యాప్ ని ఒకసారి ఓపెన్ చేసి.. ఏం కావాలో ఆడియో రూపంలో అడిగితే చాలు. వీడియో రూపంలో సమాధానంతో పాటు కావాల్సినంత సమాచారం ఒకసారి ఇస్తుంది.

 పిల్ బాక్స్

కొన్ని సార్లు టాబ్లెట్లు వేసుకోవాల్సిన సమయాన్నిమర్చిపోతుంటాం. అయితే..పిల్ బాక్స్ యాప్ ఆ సమస్యను అధిగమించేందుకుసహాయపడుతుంది. కాకపోతే ఎప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో ముందే యాప్లో సెట్ చేసుకోవాలి. దీంతో సమయానికి ఏయే మందులువేసుకోవాలో గుర్తుచేస్తుంది.

మోషన్ డాక్టర్

ప్రమాదవశాత్తు లేదంటే ఇతర కారణాలతోగాయాలైనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు.అలాంటి వాళ్ల కోసం ఈ యాప్ . వయసుతోసంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడే యాప్ ఇది. వయసు మీద పడినవాళ్లకుఈ యాప్ చాలా ఉపయోగకరం. కిందపడినప్పుడు ఎముకలు కదిలిపోయినా లేదంటేవిరిగినా చేయాల్సిన ప్రథమ చికిత్స గురించిఈ యాప్ చెబుతుంది.

ఫాల్ డిటెక్టర్

వయసు పైబడితే ఒంట్లో పట్టు సడలిపోతుంది. కొన్నిసార్లు కిందపడిపోతుంటారుకూడా. అయితే, ఇంట్లో ఎవరూ లేకపోతే..మరి వాళ్లను పట్టించుకునేది ఎవరు?ఇలాంటి ప్రశ్నలకు ఈ యాప్ తో చెక్చెప్పొచ్చు. ఇంట్లోని పెద్దవాళ్లు రోజూవారీ ప్రవర్తనకు భిన్నంగా లేదంటే తేడాగా ప్రవర్తించినా, వారి ఆరోగ్యం, కదలికల విషయాల్లో తేడాలొచ్చినా.. ఈ యాప్ వెంటనే పసిగడుతుంది. ఆ యాప్ లో కనెక్ట్ అయినవాళ్లకు అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది.