కంప్యూటర్ లో ఫంక్షన్ బటన్లు ఇలా ఉపయోగపడతాయి

కంప్యూటర్ కీబోర్డులో పైన ఉండే ఫంక్షన్ బటన్స్ గురించి చాలామందికి తెలియదు. అవి నొక్కితే ఏమవుతుందో అనుకుంటారు. కానీ చాలా రకాల షార్ట్కట్ లకు ఫంక్షన్ కీస్ పనికొస్తాయి. వీటిని ఎలా ఉపయోగించొచ్చంటే..

ఫంక్షన్ బటన్స్ లో ‘ఎఫ్1 ' హెల్ప్ కు పనికొస్తుంది. వర్డ్ ఫైల్ లేదా ఇతర సాఫ్ట్ వేర్ మీద పనిచేస్తున్నప్పుడు 'ఎఫ్ 1' నొక్కితే ఆయా సాఫ్ట్ వేర్ కు సంబంధించిన హెల్ప్ విండో ఓపెన్ అవుతుంది.ఏదైనా ఫైల్, ఫోల్డర్ పేరు మార్చటానికి డబుల్ క్లిక్ చేయడానికి బదులు 'ఎఫ్ 2' నొక్కొచ్చు. ఫైల్ లేదా వెబ్సైట్ లో ఏదైనా పదాన్ని వెతకడం కోసం 'కంట్రోల్ + ఎఫ్' నొక్కుతారు. అయితే దానికి బదులుగా 'ఎఫ్ 3' నొక్కినా సరిపోతుంది.

ఏదైనా విండోను క్లోజ్ చేయడానికి 'ఆల్ట్ + ఎఫ్ 4' కలిపి నొక్కాలి. విండో లేదా వెబ్ పేజీని రిఫ్రెష్ చేయడానికి ‘ఎఫ్ 5' ఉపయోగపడుతుంది.బ్రౌజర్లలో అడ్రస్ బార్కు వెళ్లాలంటే కర్సర్ తో పనిలేకుండా 'ఎఫ్6 ' నొక్కొచ్చు. వర్డ్ డాక్యుమెంట్ లో స్పెల్లింగ్, గ్రామర్ చెక్ చేయడానికి 'ఎఫ్ 7' బటన్ వాడొచ్చు.కంప్యూటర్ బూట్ మెనూలోకి వెళ్లడానికి 'ఎఫ్8' ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్ లో ఇ-మెయిల్ పంపడానికి 'ఎఫ్9' పనికొస్తుంది. షిఫ్ట్, ఎఫ్ 10 బటన్లు కలిపి నొక్కితే రైట్ క్లిక్ మాదిరిగా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఫుల్ స్క్రీన్ మోడ్ కావాలంటే 'ఎఫ్ 11' నొక్కొచ్చు. ‘ఎఫ్ 12’తో వర్డ్ సేవ్ యాజ్ ఆప్షన్ ఓపెన్ చేయొచ్చు.