ఇప్పుడిప్పుడే వింటర్ ఎంటర్ అవుతోంది. ఈ చలికే జనాలు వణికిపోతున్నారు. కానీ.. ఇక్కడివాళ్లు ఏడాదంతా చలిలోనే గడుపుతున్నారు. ఈ ఊరి పేరు ఒమ్యాకోన్. ఇది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో మనుషులు ఉంటున్న అతి చల్లని ప్రాంతం ఇదే. అందుకే ‘కోల్డెస్ట్ విలేజ్ ఆఫ్ వరల్డ్’గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ చలికాలంలో సగటు ఉష్ణోగ్రత –50 డిగ్రీల సెల్సియస్. 1924లో ఇక్కడి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా –71.2 సెంటిగ్రేడ్స్కి పడిపోయాయి. ఒమ్యాకోన్ సిటీలకు చాలా దూరంగా ఉండే మారుమూల గ్రామం. ప్రస్తుతం ఇక్కడ సుమారు 500 మంది ఉంటున్నారు.
- ఇక్కడివాళ్లు చలి నుంచి తట్టుకోవడానికి ‘రుస్కీ’ అనే రష్యన్ టీని రెగ్యులర్‌గా తాగుతారు.
- చలి తీవ్రత వల్ల ఒక్కోసారి సమాధులు తవ్వడం కూడా కష్టమవుతుంది. నేల మొత్తం మంచుతో కప్పి ఉంటుంది. కాబట్టి.. అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు ఒక ప్లేస్‌లో మంట పెట్టి మంచు కరిగించి, నేలను తవ్వుతారు.
- అంత చలిలో వెహికల్స్ పాడైపోతాయి. కాబట్టి, వాటిని హీటెడ్ గ్యారేజీల్లోనే పార్క్ చేస్తుంటారు. ఒకవేళ బయట పెడితే.. ఇంజిన్ రన్నింగ్‌లోనే ఉంచాలి. లేదంటే రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ తక్కువే.
- చలి వల్ల ఈ ప్రాంతంలో పంటలు పండవు. కాబట్టి అక్కడివాళ్లకు పశుపోషణే జీవనాధారం. ముఖ్యంగా రెయిన్ డీర్లను పెంచుతారు. కొందరు వేటాడడం, చేపలు పట్టడం లాంటి సంప్రదాయ వృత్తుల మీద కూడా ఆధారపడతుంటారు.