ఇది వాస్తవ బడ్జెట్ : జగ్గారెడ్డి

ఇది వాస్తవ బడ్జెట్ : జగ్గారెడ్డి
అసెంబ్లీలో అర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ బడ్జెట్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసించారు. గురువారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ బిందెలో నీళ్లు తీసుకొని తాగినట్టు ఉందని తెలిపారు. గతంలో  కేసీఆర్ బడ్జెట్ చెరువులో నీళ్లు తెచ్చుకొని తాగినట్టు ఉండేదని ఎద్దేవా చేశారు. ఉత్తమ బడ్జెట్​ను పెట్టిన సీఎం రేవంత్​కు, డిప్యూటీ సీఎం భట్టికి, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఆరు గ్యారంటీల అమలుకు సరిపడా నిధులు కేటాయించారన్నారు. స్టేట్​కు గుండెకాయ లాంటి హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయించడం మంచి నిర్ణయమని,  దీనివల్ల దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. వ్యవసాయ రంగానికి రూ.72 వేల కోట్లు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి సర్కార్ అని నిరూపిం చుకుందని తెలిపారు. ఇక నుంచి చీల్చి చెండాడుతానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. అందులో  కేసీఆర్ కన్నా తామే ఎక్స్‌‌పర్ట్​లమని కౌంటర్ ఇచ్చారు.