నూతనంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబంలో మరో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. సంజీవ్ ఖన్నా తండ్రి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతేకాదు ఆయన మేనమామ హెచ్‌ఆర్ ఖన్నా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేరడానికి ముందు జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. సత్వర న్యాయం అందించడంతో ఈయన దిట్ట.
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కీలకమైన కేసుల్లో సంజీవ్ ఖన్నా ధర్మాసనంలో భాగంగా ఉన్నాడు. ఎలక్షన్లో ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ వాడకం కేసులో ఆయన దాన్ని సమర్థించారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు, జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలో ఉన్నాడు.
Also Read : జస్టిస్ సంజీవ్ ఖన్నా అనబడే నేను
తండ్రి, మేనమామ కూడా జస్టిస్లే
ఎమర్జెన్సీ టైంలో కేంద్రాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా మేనమామ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించారు. ప్రస్తుతం సీజేఐ మేనమామ జస్టిస్ HR ఖన్నా 1976 ఎమర్జెన్సీ సమయంలో ADM జబల్‌పూర్ కేసులో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు. జబల్‌పూర్ కేసు విచారణలో ఆయనకు కూడా ధర్మాసనంలో సభ్యుడే. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల రద్దును సమర్థిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పును ఈయన ఖండించారు. తర్వాత జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాను తప్పించి ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఎంహెచ్ బేగ్‌ను నియమించింది. జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా 1973 కేశవానంద భారతి కేసు ధర్మాసనంలో కూడా ఉన్నాడు.