బత్తుల ప్రభాకర్.. బత్తుల ప్రభాకర్.. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మార్మోగుతున్న పేరు.. ఎవరీ బత్తుల ప్రభాకర్ అంటే.. వీడొక క్రిమినల్.. చీటర్.. చీటింగ్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాడు.. ఏదో 5, 10 కోట్లు కాదు.. ఏకంగా 333 కోట్లు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. అంతేనా.. ఇన్ని కోట్లు సంపాదించాలంటే నిజాయితీగా అయితే అసాధ్యం అనుకున్నాడు.. అందుకే అడ్డదారుల్లో సంపాదించాలని డిసైడ్ అయ్యాడు.. ఇందు కోసం ఏమైనా.. ఏదైనా చేయటానికి నిర్ణయించుకున్నాడు బత్తుల ప్రభాకర్.. సిటీలోని 100 మంది అమ్మాయిలతో స్నేహం చేయాలని.. 100 మంది అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేయాలనేది అతని సెకండ్ టార్గెట్.. విచారించే కొద్దీ బత్తుల చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.. పోలీసులకే మైండ్ బ్లాండ్ అవుతుంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర ఇటీవల పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తిని బత్తుల ప్రభాకర్‌గా గుర్తించిన పోలీసులు.. నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్‌ను పోలీసులు దర్యాప్తు చేయగా.. మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులు ఖంగుతిన్నారు. నిందితుడు బత్తుల ప్రభాకర్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా. కేవలం 8వ తరగతి వరకే చదువుకున్న ప్రభాకర్.. ఈజీ మనీకి అలవాటు పడి చిన్నతనం నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.
ALSO READ : చిక్కులు తెచ్చిన డేటింగ్ యాప్.. వీడియో తీసి ‘గే’ జంటను దోచేసిన ముఠా
నేర ప్రవృత్తిలోకి దిగిన ప్రభాకర్ ప్రధానంగా రెండు టార్గెట్లు పెట్టుకున్నాడు. ఒకటి.. రూ.333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయడం. ఇంకొంటి 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండటం. తన లక్ష్యాలను నేరవేర్చుకునేందుకు ప్రభాకర్ దొంగతనాలు, మోసం చేయడం, బ్లాక్ మెయిలింగ్, బెదిరించడం, వినకపోతే హత్య చేయడం వంటి మొదలుపెట్టాడు. బీహార్లో కొందరితో పరిచయం పెంచుకుని గన్స్ కొనుగోలు చేశాడు. ఇలా.. 3 వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్.. ఒకేరోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు.
బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర రెడ్డి, రాజు వంటి పేర్లతో ప్రభాకర్ నేరాలకు పాల్పడుతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ జర్నీలో ప్రభాకర్ పై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. కొన్నిసార్లు జైలుకు సైతం వెళ్లాడు. ఛాతీ మీద తన లక్కీ నెంబర్ 3 టాటూ వేసుకుని నిత్యం దాన్ని చూసుకుంటూ తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ నార్సింగ్లోని గెటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న ప్రభాకర్.. ఒరిస్సాకి చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు నెలకొకటి మారుస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే 2025, ఫిబ్రవరి 1వ తేదీన చిల్ అయ్యేందుకు పబ్‌కి వెళ్లాడు. మోస్ వాంటెడ్‌గా క్రిమినల్‌గా ఉన్న ప్రభాకర్ పబ్ కు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. పోలీసులను చూసిన నిందితుడు ప్రభాకర్ వారిపై కాల్పులు జరిపారు. నిందితుడి కాల్పుల్లో ఓ కానిస్టేబుల్, పబ్ బౌన్సర్ గాయపడ్డారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరకు ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్‌ను పోలీసులు విచారించగా.. దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.