మేడారం రూట్ మ్యాప్​ ఇదే

మేడారం రూట్ మ్యాప్​ ఇదే
  • 16 నుంచి జాతర ప్రారంభం 
  • రూల్స్​ బ్రేక్​ చేస్తే వెహికల్ ​సీజ్
  • 33 పార్కింగ్​ ప్లేసులు రెడీ

మేడారం మహాజాతర ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్, ఓన్, ఆర్టీసీ, వీఐపీ, వీవీఐపీ వెహికల్స్​లో వచ్చిపోయే భక్తుల కోసం పోలీసులు రూట్ మ్యాప్ ​రిలీజ్ ​చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచే వన్​ వే రూల్స్​ అమల్లోకి వచ్చాయి. వెహికల్స్​ పార్కింగ్​కు 1,100 ఎకరాల్లో 33 పార్కింగ్ ప్లేస్​లను రెడీ చేశారు. పోలీసులు ఇచ్చిన రూట్​ను ఫాలో కాకపోతే వెహికల్స్​ సీజ్ చేస్తారు.

 - జయశంకర్ భూపాలపల్లి (మేడారం), వెలుగు

మహారాష్ట్ర, మంచిర్యాల, ఆదిలాబాద్, మంథని, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కాటారం, చింతకాని, పెగడపల్లి మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ రోడ్డు వన్​వేగా ప్రకటించారు. ఈ రూట్ ద్వారా వచ్చే భక్తులకు కన్నెపల్లి, ఊరట్టం వద్ద పార్కింగ్ ఫెసిలిటీ కల్పించారు.  వీరు తిరుగుప్రయాణంలో కమలాపూర్ క్రాస్​నుంచి రైట్ తీసుకొని వెళ్లిపోవాలి. ఇవాళ్టి  (15వ తారీఖు) నుంచి ముందుగా వచ్చే వెహికల్స్​ను కన్నెపల్లి, ఊరట్టంలలోని పార్కింగ్ స్థలాల్లో నింపుతూ వెనకకు వస్తారు. భక్తుల సౌకర్యం కోసం, నడవలేని వారిని తీసుకెళ్లడానికి నార్లాపూర్​ దగ్గర చింతల్ నుంచి సమ్మక్క గద్దెల వరకు ఆర్టీసీ ఉచితంగా  30 బస్సులు నడిపిస్తోంది.  

హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, నల్గొండ తదితర జిల్లాలకు చెందిన భక్తులు హన్మకొండ, గుడెప్పాడ్​ మీదుగా పస్రా చేరుకోవాలి. వీరు తిరుగు ప్రయాణంలో కమలాపూర్ క్రాస్ నుంచి లెఫ్ట్ తీసుకొని భూపాలపల్లి చేరుకోవాలి. ఇక్కడి నుంచి పర్కాల, అంబాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజ్, వరంగల్ బైపాస్, కరుణాపురం, పెండ్యాల మీదుగా వెళ్లిపోవాలి.

మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే వారు మల్లంపల్లి మీదుగా ఎన్​హెచ్​ రోడ్డు పైకి వచ్చి పస్రా వరకు వెళ్లి, లెఫ్ట్ క్రాస్ తీసుకొని మేడారం చేరుకోవాలి. వీరి కోసం నార్లాపూర్ నుంచి కన్నెపల్లి వరకు 20కి పైగా పార్కింగ్ స్థలాలు కేటాయించారు.  తిరుగుప్రయాణంలో కమలాపూర్ క్రాస్ నుంచి భూపాలపల్లి, పరకాల చేరుకొని గుడెప్పాడ్ క్రాస్​ మీదుగా మళ్లీ మల్లంపల్లికి వచ్చి అక్కడ  రైట్ తీసుకొని వెళ్లిపోవాల్సి ఉంటుంది.

ప్రైవేట్ అండ్ ఓన్ వెహికల్స్ ఇలా..

జాతరకు వచ్చే ప్రైవేట్ అండ్  ఓన్ వెహికల్స్​మేడారం చేరుకోవడానికి మూడు రూట్లలో అనుమతులు ఇవ్వగా తిరిగి వెళ్లిపోవడానికి మాత్రం రెండు రూట్లు మాత్రమే ఉన్నాయి. పస్రా‒మేడారం, కాటారం‒మేడారం, చిన్నబోయినపల్లి‒మేడారం రూట్లలో ప్రైవేట్ వెహికల్స్ మేడారం చేరుకోవాలి. ప్రైవేట్​వెహికల్స్​ తిరిగి వెళ్లేటప్పుడు మేడారం‒కమలాపూర్, మేడారం‒చిన్నబోయినపల్లి రూట్లలో పంపిస్తారు. పస్రా‒మేడారం, కాటారం‒మేడారం రూట్​లో మేడారం చేరుకునే ప్రైవేట్, ఓన్ వెహికల్స్​ తిరుగు ప్రయాణంలో మేడారం నుంచి నార్లపూర్ క్రాస్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, దూదేకులపల్లి, కమాలాపూర్ క్రాస్ మీదుగా పంపిస్తారు.

ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వెహికల్స్

ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వెహికల్స్ కు ఒకటే రూట్​పర్మిషన్​ ఇచ్చారు. ఎటు నుంచి వచ్చిన వెహికల్​ అయినా తాడ్వాయి చేరుకొని అక్కడి నుంచి 16 కి.మీ దూరంలో ఉన్న మేడారం చేరుకోవాలి. ఇక్కడ ఆర్టీసీకి, వీఐపీ, వీవీఐపీ వెహికిల్స్​కు వేర్వేరుగా పార్కింగ్​ప్లేసులు అలాట్​ చేశారు. 3,845 ఆర్టీసీ బస్సులతో పాటు 10 వేల వీఐపీ, వీవీఐపీ వెహికల్స్​ పార్కింగ్​ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ వెహికల్స్అన్నీ తిరిగి వెళ్లేటప్పుడు ఇదే రూట్​ ఉపయోగించాలి.

వెహికల్స్​ పార్కింగ్​ ఇక్కడే..

పస్రా ‒ మేడారం ‌ రూట్‌‌లో 

కొత్తూరు 1, 2, 3, కొత్తూరు స్తూపం, 
    జంపన్నవాగు రోడ్‌‌ 
    కన్నెపల్లి రోడ్‌‌
    కాల్వపల్లి చెక్‌‌ పోస్ట్‌‌ 
    కాల్వపల్లి క్రాస్‌‌ రోడ్‌‌ 1, 2 
    బయ్యక్కపేట
    చింతల్‌‌ ఆర్‌‌టీసీ బస్‌‌స్టేషన్‌‌ 
    చింతల్‌‌ క్రాస్‌‌ రోడ్డు, చింతల్‌‌ చెక్‌‌పోస్టు 
    అరుమల్ల గుట్ట
    వెంగళాపూర్‌‌ 
    టర్కోని చింతల్‌‌, ఒల్లని చింతల్‌‌ 
    యాసంగి తోగు 
    మొట్లగూడెం పార్కింగ్‌‌
చిన్నబోయినపల్లి‒మేడారం 
రూట్‌‌లో పార్కింగ్​
    ఊరట్టం 2సీ, 
    ఊరట్టం 2బి, 
    ఊరట్టం 2 ఏ, 
    ఊరట్టం 1బీ, 
    ఊరట్టం 1ఏ, 
    ఊరట్టం, 
    బాసగూడెం