వేలానికి లెండర్ల ఓల్డ్ వెహికల్స్
యూజ్డ్ కారుకు గ్రామాలే పెద్ద మార్కెట్
133 శాతం పెరిగిన డిమాండ్
వెలుగు, బిజినెస్‌డెస్క్ : సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పుంజుకుంటోంది. లోన్ రీపేమెంట్‌పై మారటోరియం ముగియడంతో.. డీఫాల్ట్ అయిన వ్యక్తుల నుంచి లెండర్లు వెహికల్స్‌ను సీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పెరిగనున్నాయి. బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకుని, కారు కొనుక్కున్న వారు ఆ మొత్తాన్ని రీపేమెంట్ చేయలేకపోతే వారి వెహికల్స్‌ను బ్యాంక్‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేస్తాయి. గత ఆరు నెలలుగా మారటోరియం ఉండటంతో డిఫాల్టర్లపై బ్యాంక్‌లు ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. కానీ ఇక నుంచి లోన్ రీపేమెంట్ చేయకుండా డిఫాల్ట్ అయితే కారును లెండర్లు సీజ్ చేస్తారు. ఈ వెహికల్స్ యూజ్డ్ కారు మార్కెట్‌కు మరింత బూస్టప్ ఇస్తాయి. కరోనా అవుట్‌బ్రేక్‌తో మధ్యతరగతి ప్రజలు చాలా మంది ఇప్పుడు చౌకగా సొంత కారు కొనుక్కోవాలని చూస్తున్నారని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. కారు కంపెనీలు తీసుకొచ్చిన ‘సబ్‌స్క్రిప్షన్’ స్కీమ్‌లు కూడా పర్సనల్ వెహికల్స్‌ను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ‘బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు డిఫాల్టర్స్ నుంచి మళ్లీ కార్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభిస్తే ఈ నెల నుంచి చాలా యూజ్డ్ కార్లు అందుబాటులోకి వస్తాయి. యూజ్డ్ కార్ల సప్లయి కూడా పెరుగుతుంది’ అని మహింద్రా ఫస్ట్ ఛాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశుతోష్ పాండే చెప్పారు.
గ్రామాల నుంచి డిమాండ్
రూరల్ ఏరియాలు యూజ్డ్ కార్లకు అతిపెద్ద మార్కెట్లని ఓఎల్‌ఎక్స్ ఆటోస్ ఇండియా హెడ్ అమిత్ కుమార్ తెలిపారు. యూజ్డ్ కార్లకు 70 శాతం డిమాండ్, సప్లయి నాన్ మెట్రోల నుంచే వస్తుందని తెలిపారు. 61 శాతం కారు కొనుగోలుదారులు కూడా వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు తమ ఇంటర్నల్ డేటాలో వెల్లడైనట్టు అమిత్ చెప్పారు. తమ ప్లాట్‌ఫామ్‌పై యూజ్డ్ కార్ల డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఆగస్ట్‌లో 133 శాతానికి పైగా పెరిగిందని ఓఎల్‌ఎక్స్ ఇండియా తెలిపింది. అయితే సప్లయిలో గ్రోత్ మాత్రం 112 శాతంగానే ఉన్నట్టు చెప్పింది. యూజ్డ్ లగ్జరీ కార్ల లిస్టింగ్‌లో మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. సెప్టెంబర్‌లో యూజ్డ్ వెహికల్స్‌కు 10 శాతం నుంచి 15 శాతం ఎక్కువ గిరాకీ వచ్చిందని డీలర్లు చెప్పారు.
లోన్లు తీసుకుని మరీ కొంటున్నారు…
2021 ఆర్థిక సంవత్సరంలో యూజ్డ్ కారు ఇండస్ట్రీ 3.7 మిలియన్ యూనిట్ల సేల్స్‌ను పోస్ట్ చేస్తుందని అంచనాలున్నాయి. ఆర్గనైజ్డ్ మార్కెట్ ఇండియాలో 18 శాతం ప్రీ ఓన్డ్ కార్లను అమ్ముతుంది. లాక్‌డౌన్ కాలంలో ప్రీ ఓన్డ్ మార్కెట్‌లో అమ్ముడుపోయిన వెహికల్స్‌లో మారుతీ స్విఫ్ట్, డిజైర్, మహీంద్రా బొలెరో, హ్యుండాయ్ ఐ10, ఐ20, హోండా సిటీ, టయోటా ఇన్నోవాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. యూజ్డ్ కార్లను కొనేందుకు చాలా మంది ఇప్పుడు లోన్లు కూడా తీసుకుంటున్నారు. యూజ్డ్ కారును కొనే వారు అప్పట్లో 20 –25 శాతం మంది ఉంటే.. ఇప్పుడు వారు 35–40 శాతానికి పెరిగినట్టు మారుతీ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. యూజ్డ్ కార్లకు డిమాండ్ స్థిరంగా పెరుగుతుందని, కానీ సప్లయి మాత్రం ఆశించదగ్గ స్థాయిలో లేదని పాండే చెప్పారు. ఈ అనిశ్చితి పరిస్థితుల్లో కొత్త కారు కోసం పాత కారును అమ్మేవారు తగ్గారని అన్నారు. దీంతో సప్లయి తగ్గినట్టు పేర్కొన్నారు. ఫస్ట్ టైమ్ బయ్యర్ల నుంచి, ఇప్పటికే కారు ఉండి ఫ్యామిలీ కోసం మరో వెహికల్ తీసుకోవాలనుకునే వారి నుంచి సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగినట్టు శ్రీవాస్తవ చెప్పారు.
For More News..