ఆధ్యాత్మికం : బుద్ధుడి మరణ రహస్యం ఇదే.. చనిపోయే ముందే ఆలోచించాలి.. చచ్చిన తర్వాత ఎందుకు..?

ఆధ్యాత్మికం : బుద్ధుడి మరణ రహస్యం ఇదే.. చనిపోయే ముందే ఆలోచించాలి.. చచ్చిన తర్వాత ఎందుకు..?

జీవితం శాశ్వతం కాదు. దాని ప్రయాణం ఎక్కడో మొదలై... ఎన్నో కష్ట నష్టాలు దాటి... మరణం అనే తీరానికి చేరుకుంటుంది. 'మరణం తర్వాత ఏమవుతుంది?' అనే ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. ఈ ప్రశ్న ఇప్పుడు పుట్టిందేం కాదు. మనిషికి బుద్ధి వచ్చినప్పుడే ఉదయించింది. మరణానికి ఒక్కో మతం ఒక్కో సమాధానం చెప్పినా.. ఇప్పటికీ దాని గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. పూర్వం గౌతమ బుద్ధుడికి కూడా తన శిష్యుడి నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురైంది. 'మరణం తాలుకా రహస్యం ఏంటి' అని గౌతమ బుద్దుడ్ని అడుగుతాడు ఒక శిష్యుడు.. దీనికి ఆయన చిన్నగా నవ్వి.. 'ఓ. బాణం నీ చేతికి తగిలి గాయం చేసినప్పుడు.. దాన్ని పీకెయ్యడానికి ప్రయత్నిస్తావా? లేదా అది ఎక్కడ నుంచి వచ్చింది? ఏ దిశలో వచ్చింది? అని ఆలోచిస్తావా?' అని తిరిగి అడుగుతాడు.

దాన్ని పీకెయ్యడానికే ప్రయత్నిస్తాను' అని బదులిస్తాడు శిష్యుడు. ఎందుకంటే.. అదొక వేళ విష బాణమైతే శరీరమంతా పాకుతుంది. "గొప్పగా చెప్పావు' అని బుద్ధుడు ఆ శిష్యుడ్ని అభినందిస్తాడు. 'సమస్య ఏదైనా... దానికి ముందు పరిష్కారం ఆలోచించాలి. మరణం ముందు ఏం చేయాలో ఆలోచించాలి. కానీ, మరణించిన తర్వాత ఏం అవుతుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అని ఆలోచించకూడదని చెప్తాడు. గురువు అంతరంగం అర్థం చేసుకున్న శిష్ముడు సంతోషిస్తాడు.

V6 వెలుగు