కంప్యూటర్ చిప్ అంటే చిన్నగా, చేతి వేలిపై ఇమిడేలా ఉంటుంది. కానీ, కాలిఫోర్నియాకు చెందిన సెరిబ్రస్ సిస్టమ్స్ అనే స్టార్టప్ ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ చిప్‌ను తయారు చేసింది. 21 చదరపు సెంటీమీటర్లున్న దాని పేరు వేఫర్ స్కేల్ ఇంజన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ– ఏఐ)కి ఈ చిప్పే మూల స్తంభంలా ఉంటుందని కంపెనీ అంటోంది. మామూలు కంప్యూటర్ చిప్‌లలో 30 ప్రాసెసర్ కోర్లుంటాయి. అదే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లలో అయితే వాటి కన్నా ఎక్కువ ఉంటాయి. జీపీయూ చిప్‌లో దాదాపు 5 వేల దాకా కోర్లు ఉంటాయి. కానీ, సెరిబ్రస్ తయారు చేసిన ఈ పెద్ద చిప్‌లో 4 లక్షల కోర్లున్నాయి. ఆ కోర్లను ఒకదానికొకటి హై బ్యాండ్‌విడ్త్‌లతో కనెక్ట్ చేసి పెట్టారు. దాని వల్ల అతి కష్టమైన మెషీన్ లెర్నింగ్ సవాళ్లనూ ఈజీగా చేయొచ్చని కంపెనీ చెబుతోంది. కొన్ని నెలలు పట్టే పనిని నిమిషాల్లో చేసేస్తుందని అంటోంది. ఇప్పటికే కొందరు కస్టమర్లకు ఆ చిప్‌ను కంపెనీ అమ్ముతోంది. దాని ధర ఎంతో మాత్రం చెప్పలేదు. పెద్ద చిప్‌లతో టైం కలిసొస్తుందేమో గానీ, దాని వల్ల నష్టాలూ అదే రేంజ్లో ఉంటాయని ఆనంద్టెక్ అనే న్యూస్ వెబ్ ఎడిటర్ డాక్టర్ ఇయాన్ కట్రెస్ చెప్పారు. చిన్న చిప్‌లు తక్కువ శక్తిని తీసుకుని పని చేస్తాయని, వేడి అయితే సులభంగా చల్లార్చొచ్చని అన్నారు. కానీ, ఇలాంటి పెద్ద చిప్‌లను వాడాలనుకుంటే మాత్రం వాటికంటూ ప్రత్యేకమైన సెంటర్లు, వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందన్నారు. కాబట్టి ప్రాక్టికల్‌గా వాటి వాడకం ఖర్చుతో కూడుకున్నదని వివరించారు. కాబట్టి ప్రస్తుతానికి అది ఏఐకి మాత్రమే సూట్ అవుతుందని చెప్పారు.
ప్రపంచంలోనే పెద్ద కంప్యూటర్ చిప్
- టెక్నాలజి
- August 21, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బతికి ఉండగానే ఊరంతా పెద్దకర్మ భోజనాలు : తల్లి వింత కోరిక తీర్చిన కుమారులు
- మొబైల్ బానిసలుగా ఇండియన్స్..రాత్రీపగలూ లేకుండా సెల్ఫోన్లోనే..
- 120 గంటలు పని చేసేవాళ్లు సూపర్ పవర్ గా ఉంటారు: ఎలన్ మస్క్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
- వాలైంటెన్స్ డే రోజున ఆ ఓటిటిలో నాగచైతన్య పెళ్లి వీడియో రిలీజ్ కానుందా..?
- Virat Kohli: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. సచిన్ మరో ఆల్‌టైం రికార్డుకు చేరువలో కోహ్లీ
- Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ
- హిందూ బీసీలు..ముస్లీం బీసీలు ఉంటారా?.. సర్వే చూసి బాధపడ్డాం: పాయల్ శంకర్
- Tri-Series: పాకిస్తాన్లో ట్రై-సిరీస్.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు
- అమెరికా గెంటేసిన భారతీయులు 205 మంది:యుద్ధ విమానంలో ఇండియాకు
Most Read News
- RBI Recruitment: గంటకు వెయ్యి రూపాయల జీతం.. RBIలో ఉద్యోగాలు
- Good Health: ప్రతిరోజూ రాత్రి రెండు యాలకలు తిని పడుకోండి.. ఎన్ని లాభాలో..
- నా దగ్గర రూపాయి లేదు.. అందుకే సన్యాసం తీసుకున్నా..: మాజీ హీరోయిన్ కన్నీటి కథ
- Govt Jobs: NTPCలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. నెలకు లక్షన్నర వరకు జీతం
- Jasprit Bumrah: నా మేనల్లుడు రూపంలో బుమ్రా నన్ను భయపెడుతున్నాడు: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్
- ఐకానిక్ బ్రిడ్జికి లైన్ క్లియర్! నెలాఖరులోగా టెండర్లు .. తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ప్రాజెక్ట్
- Good News : రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రభుత్వం సన్నాహాలు
- నదిలో శవాలు పడేశారు.. మహా కుంభమేళా నీరు కలుషితం.. జయాబచ్చన్ సంచలన ఆరోపణలు
- తెలంగాణలో 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఫైనల్
- మిస్ యూ కేపీ అన్నా : సురేఖ కుమార్తె సుప్రిత