
సాధారణంగా .. అత్తా.. కోడలు అంటే ఒకరిపై మరొకరు కస్సు బుస్సులాడుకుంటారు. ప్రతి విషయంలో .. అత్త అవును అంటే.. కోడలు కాదు అంటుంది. కొన్ని కాపురాలు అత్త కోడళ్ల గొడవలతో కూలిపోయినవి కూడా ఉన్నాయి. కాని రాజోలు లో ఓ కుటుంబంలోని అత్త కోడలు ఆదర్శంగా నిలిచారు. అత్త 50 వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో .. అత్తకు ఆమె కోడలు కోటి రూపాయిల విలువైన గిఫ్ట్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది.
ప్రస్తుత సమాజంలో అత్తా కోడలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రతి చిన్న విషయానికి గొడవలు.. అభిప్రాయ బేధాలు సహజంగా ప్రతి ఇంట్లో కూడా వస్తాయి. బంధువుల సంబంధమైనా... మేనరికమైనా సరే ఇలాంటివి సాధారంణంగా ఉంటాయి. కాని వేల కుటుంబాల్లో ఒకటో .. రెండో కుటుంబాల్లో అత్తకోడళ్ల మధ్య సయోధ్య కుదిరి చాలా సఖ్యతగా ఉంటారు. ఇలాంటి కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి..సినిమాల్లోనో .. సీరియళ్లలో ఇలాంటి ఘటనలు చూస్తుంటాం.
కానీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఓ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఈ సెలబ్రేషన్స్ లో అత్తగారి 50 వ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఇంటి ఇల్లాలు.. అంటే ఆమె కోడలు దాదాపు కోటి రూపాయిల విలువైన గిఫ్ట్ ఇచ్చి అత్తగారి ఆశీర్వాదం తీసుకుంది కోడలు.
కూతురి కంటె ఎక్కువుగా చూస్తూ.. అత్త పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించి... అందర్నీ ఆశ్చర్య చకితులను చేసింది.
Also Read :- ఇన్ కం ట్యాక్స్ కొత్త రూల్
రాజోలు చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కాసు శ్రీనివాస్ - భవానీ దంపతులు లకు జన్మించిన సుకేష్ కు రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన శ్రీరంగనాయకి తో వివాహం జరిగింది. అప్పటి నుండి అత్తా మామలు తనను కన్న తల్లిదండ్రుల వలే చూసుకుంటున్నారంటు ఓ వేడుకలో కన్నీటి పర్యంతం అయింది.
అత్త భవానీ 50 వ పుట్టినరోజు నాడు ఎవరు చేయలేనంత అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుక చేయాలనినిర్ణయించింది. దీనిలో భాగంగానే నాలుగు పట్టుచీరలు , పసుపు కుంకుమ, గాజులు,మంగళసూత్రం..వంద గ్రాముల బంగారు బిస్కెట్..మూడు, 28 లక్షల రూపాయిల విలువ చేసే డైమండ్ నెక్లెస్.. యాభై లక్షల యాభై రూపాయల యాభై పైసలు నగదు వంటి భారీ బహుమతులు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది.
తన అత్త పుట్టినరోజు కలకాలం గుర్తుండిపోయేల చేశారు. మొదట యాభై అడుగుల పుష్పాలంకరణలో పాదాలు వేసి, ముత్తైదువులతో హారతి ఇచ్చి యాభై అడుగులలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ లోపలకు నడిపించారు.అనంతరం స్థానిక ప్రముఖ వైద్యులు అచ్యుత్ సమకూర్చిన భారీ కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. అనంతరం వేడుకలకు విచ్చేసిన వందలాది ముత్తైదువులు భవానీని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు.