ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆ గ్రామంలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలిబిడ్డ

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆ గ్రామంలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలిబిడ్డ

ఆ గ్రామంలో ఏ ఇల్లుచూసినా తోలు బొమ్మలతో నిండి ఉంటుంది..60 యేళ్లు పైబడిన వృద్దులే కనిపిస్తారు. యువకులంతా ఉపాధికోసం వలస వెళ్లిన దుస్థితి. ఇల్లు విడిచి వెళ్లిన పిల్లలను ఆ తోలుబొమ్మల్లో చూసుకుంటున్నారు ఆ వృద్దులు. 20యేళ్లుగా ఆ గ్రామంలో ఒక్క బిడ్డ జన్మించింది లేదు. అయితే ఇప్పుడు ఆ ఊరికి కొత్త కళ వచ్చింది.. ఇక  తోలు బొమ్మలు వాడే దుస్థితికి పోయింది. ఇంతకీ ఆగ్రామంలో ఏం జరిగింది.. ఎందుకు ఆ దుస్థితి వచ్చింది..

జపాన్ లోని ఇచినోనో గ్రామంలో రీకాటో (33), తోషికి కటో(31) అనే జంటకు కొడుకు పుట్టాడు. 20యేళ్ల తర్వాత పుట్టిన తొలి బిడ్డ..అందుకే ఆ ఊరంగా  సంబరాలు చేసు కుంటోంది. ఆ గ్రామస్తులంతా ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. బొమ్మలు కొనిస్తున్నారు. బట్టలు కొనిస్తున్నారు. ఇకపై తమకు తోలు బొమ్మలతో సరిపెట్టుకునే పరిస్థితి లేదని సంబర పడిపోతున్నారు. 

ఇచినోనో గ్రామంలో ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా తోలు బొమ్మలతో నిండిపోయి ఉండేది. 60 కుటుంబాలున్న ఆ గ్రామంలో అత్యధికులు 60యేళ్లు దాటినవారే. ఉపాధి విద్యకోసం యువకులు వలసబాట పట్టారు. దాదాపు 20యేళ్లుగా గ్రామంలో ఒక్క జననం లేదు.పిల్లలు లేని లోటు పూడ్చేందుకు అక్కడి వారు తోలు బొమ్మలను చూసుకుంటూ కాల గడిపేస్తుండేవారు. 

అయితే ఇటీవల కోవిడ్ వారికి కొంత ఉపశమనం కలిగించిందనే చెప్పాలి..ఎందుకంటే కోవిడ్ సమయంలో ఆ గ్రామానికి చెందిన యువత తిరిగి సొంతూరికి వచ్చారు. దీంతో జంటలు ఒక్కటయ్యాయి. ఫలితంగా రెండు దశాబ్దాల తర్వాత ఓ బిడ్డ జన్మించింది. 

ఇచినోనో లో ఈ దుస్థితి కారణం జపాన్ లో  పెరుగుతున్న జనాభా క్షీణత సంక్షోభం..ఈ దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా 65 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులే ఉన్నారు. జపాన్ జనాభా క్రమంగా తగ్గుతోంది.65 ఏళ్లు..అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఇప్పుడు రికార్డు స్థాయిలో 36.25 మిలియన్లు ఉన్నారు. 

ఇది మొత్తం జనాభాలో దాదాపు 30శాతం.దేశం మొత్తం జనాభా 2023లో వరుసగా 15వ సంవత్సరం క్షీణించింది. కేవలం 7లక్షల 30వేల మంది నవజాత శిశువులు మాత్రమే జన్మించారు. ఇచినోనో గ్రామం ఇందుకు ఓ నిదర్శనం.