ఎంత మానవత్వం : మధ్యాహ్న భోజనానికి ఉచితంగా కూరగాయలు

ఎంత మానవత్వం : మధ్యాహ్న భోజనానికి ఉచితంగా కూరగాయలు

మధ్యాహ్న భోజన పథకం... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం 1995లో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. సర్కార్ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించటం, పిల్లలకు పోషకాహారం అందించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. మధ్యాహ్న భోజన పథకం అమలు తర్వాత ప్రభుత్వ పాఠశాలల తీరు చాలావరకు మారింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకానికి కర్ణాటకకు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కూడా తనవంతు సాయం అందిస్తున్నాడు.

దక్షిణ కర్ణాటకలోని మెల్కర్ గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫ్ అనే కూరగాయల వ్యాపారి మధ్యాహ్న భోజనానికి ఉచితంగా కూరగాయలు సప్లై చేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. షరీఫ్ దాతృత్వానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. షరీఫ్ కు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయాలన్న ఆలోచన ఓ టీచర్ పరిచయం ద్వారా వచ్చింది.

Also Read :- ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం

ఎనిమిదేళ్ల క్రితం మాజీకి చెందిన సంగీత శర్మ అనే ఓ హైస్కూల్ టీచర్ షరీఫ్ ని కలిసింది. సంగీత షరీఫ్ తాను పనిచేస్తున్న గవర్నమెంట్ స్కూల్ యొక్క దీనస్థితి గురించి వివరించి ఉచితంగా కూరగాయలు సప్లై చేయాలని కోరింది. అప్పటి నుండి షరీఫ్ 250మంది పిల్లలు చదువుతున్న స్కూల్ కి ఉచితంగా కూరగాయలు అందిస్తున్నాడు షరీఫ్. మాజీలోని స్కూల్ కి మాత్రమే కాకుండా మరికొన్ని గ్రామాల్లోని స్కూళ్లకు కూడా ఉచితంగా కూరగాయలు అందిస్తున్నాడు.