
సముద్రంలో సకల సదుపాయాలతో ఉండే యాచ్‌ల గురించి మనకు తెలుసు. కానీ, యాచ్‌లను తలదన్నే రీతిలో ల్యాండ్ సూపర్ యాచ్‌ను రూపొందించింది జర్మనీకి చెందిన కార్ కంపెనీ డెంబెల్ మోటార్హోమ్స్. రిటైర్ అయిన ఇంజనీర్ల సహాయంతో ప్రపంచంలోనే తొలి ఫస్ట్ క్లాస్ లగ్జరీ వెహికల్‌ను తయారు చేసింది. ఇందులోని పోష్ ఇంటీరియర్‌ను అజిముత్ యాచ్ అనే సంస్థ డిజైన్ చేసింది. త్రీ యాక్సెస్ మెర్సిడెస్ చాసీస్తో నడిచే ఈ వెహికల్లో లెదర్ సోపా, డైనింగ్ చైర్లు, ఆంబియంట్ లైటింగ్, ఒవెన్, డిష్వాషర్, మైక్రోవేవ్, 60 గ్యాలన్ల రిఫ్రిజిరేటర్, హోం థియేటర్ కూడా ఉన్నాయి. ఇంకా బస్ సైజు కంటే పెంచుకునే వీలున్న మాస్టర్ బెడ్రూం ఉంది. ఇందులో కింగ్ సైజ్ బెడ్, 55 ఇంచ్‌ల టీవీ కూడా ఉంటాయి. అలాగే ఫోల్డ్ చేసుకునేందుకు వీలుగా మరో క్వీన్ సైజ్ బెడ్ కూడా ఉంది. దీనిని ఫోల్డ్ చేసి ఆ ప్లేస్‌ను ఆఫీసుగా లేదా ఎంటర్టైన్మెంట్ ఏరియాగా వాడుకోవచ్చు. ఎకో ఫ్రెండ్లీ అయిన ఈ వెహికల్లో రూఫ్ మౌంటెడ్ సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. 270 గ్యాలన్ల ఫ్రెష్ వాటర్ ట్యాంక్, ఆన్ బోర్డ్ జనరేటర్ కూడా ఉన్నాయి. బస్సు లోపల ఆరున్నర అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీని వల్ల పొడుగ్గా ఉన్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రతి రూమ్‌కు గ్లాస్ డోర్లు, హార్డ్ వుడ్ ఫ్లోర్ ఉంటుంది. ఫ్రంట్ క్యాబిన్లో నలుగురు కూర్చోవడానికి వీలుంటుంది. ఇంకా సిరామిక్ టాయిలెట్, స్లీక్ వెసెల్ సింక్ కూడా ఉన్నాయి. ఇందులో గ్యారేజ్ సదుపాయం కూడా ఉంది. మోడల్‌ను బట్టి సైకిల్, స్కూటర్, స్మార్ట్ కార్ చివరికి ఫెరారీ స్పోర్ట్స్ కార్ ను కూడా ఇందులో పార్క్ చేసుకోవచ్చు. కిచెన్, స్పా మాదిరిగా ఉండే షవర్, అలాగే వాషర్, డ్రయర్ కూడా ఉంటాయి. సుమారు 232 అడుగుల ఇంటీరియర్ స్పేస్ ఉంటుంది. డెంబెల్ కంపెనీ అఫీషియల్‌గా ఈ నెల 27న ల్యాండ్ సూపర్ యాచ్‌ను లాంచ్ చేయనుంది. దీని రేటు ఎంత అనేది కంపెనీ ప్రకటించకపోయినా.. సుమారు 2 మిలియన్ డాలర్లు ఉండవచ్చని మీడియా అంచనా వేస్తోంది. కాగా, చైనాకు చెందిన ఆటోమేకర్ మాక్సస్ ఇలాంటిదే డబుల్ డెక్కర్ వెహికల్‌ను ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది. ఇందులో ఎలివేటర్, బాల్కనీ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 215 అడుగుల లివింగ్ స్పేస్, పైన 133 అడుగుల రూఫ్‌టాప్ సన్ రూమ్ ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మాక్సస్ లైఫ్ హోం వీ90 విల్లా ఎడిషన్ రేటు 4,13,000 డాలర్లు.