బీ అలర్ట్..మీ ఫోన్లలోకి కొత్త వైరస్ వస్తోంది. ఇది మామూలు వైరస్ కాదు..చాలా డేంజరస్ వైరస్..మీ ఫోన్ల నుంచి డేటా ను దొంగిలించే వైరస్..SpyNote అని పిలువబడే ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ ను కనుగోన్నారు పరిశోధకులు. ఈ హానికరమైన యాప్ రోటిన్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ గా మీ స్మార్ట్ ఫోన్ లోకి ప్రవేశిస్తుంది. ఒకసారి ఫోన్ లోకి ప్రవేశించాక అక్కడే ఉండి ఈ నకిలీ ఆండ్రాయిడ్ మాల్వేర్ యాప్ వినియోగదారుల డేటాను దొంగిలిస్తుందని ఎఫ్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ సంస్థ నిపుణులు కనుగొన్నారు. ఇప్పటికే గూగుల్ ఈ యాప్ ప్రమాదకరమైనదని రెండ్ క్రాస్ ను జోడించింది.
SpyNote ఇతర వైరస్ కంటే ఎందుకు ప్రమాదకరం అంటే..
1.Spy Note .. ఇది కాల్ లాగ్, కెమెరా యాక్సెస్, టెక్ట్స్ మెసేజెస్, డేటా స్టోరోజీ వంటి డేటాను దొంగించడం తో పాటు.. మీ సెల్ ఫోన్లోనే ఉండిపోతోంది. ఎలా అంటే మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్ ల నకిలీ లోగోలతో హోం స్క్రీన్ పై దాగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా దీనిని గుర్తించడం చాల కష్టం. ఇది ఫోన్ కాల్స్ తో సహా ఆడియోను రికార్డు చేసి దొంగిలిస్తుంది. వినియోగదారులకు ఇది చాలా ప్రమాదకరం.
2. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ మెల్వేర్ ను ఫోన్ సెట్టింగ్ ల ద్వారా తొలగించడం కష్టం. స్పైనోట్ తెలివిగా సెట్టింగ్ మెనూ ని పదేపదే మూసివేస్తుంది. ఫ్యాక్టరీ రీసెట్ అవసరం అవుతుంది. దీని ఫలితంగా డేటా నష్టం జరుగుతుంది.
సైబర్ క్రిమినల్స్ రోజుకో విధంగా కొత్త వ్యూహాలతో తమ యాక్టివిటీని కొనసాగిస్తున్నారు. ఇది మన మొబైల్ ఫోన్లను స్పైనోట్ లాంటి మెల్వేర్ లనుంచి రక్షించుకు నేందుకు పట్టిష్టమైన భద్రతా ఏర్పాట్ల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. రెగ్యులర్ అప్ డేట్ లు, సెక్యూరిటీ యాక్టివిటీ ద్వారా ఈ హానికరమైన యాప్ లనుంచి మన స్మార్ట్ ఫోన్ల రక్షణ అత్యవసరం.