Infinix తన ఎంట్రీలెవెల్ కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. Infinix Smart 8 Plus గా పిలువ బడే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మార్చి 9 నుంచి మొదలవుతాయి. భారత్ లోని Infinix కంపెనీ నుంచి వెలువడిన స్మార్ట్ 8 సిరీస్ లో ఇది మూడో స్మార్ట్ ఫోన్. అంతకుముందు Infinix Smart 8, Infinix Smart 8 HD లను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్లను గురించి వివరాలు మీకోసం..
Infinix Smart 8 Plus స్మార్ట్ ఫోన్ ధర బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ 6,999 గా నిర్ణయించారు. మార్చి 9 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇది గెలాక్సీ వైట్, టింబర్ బ్లాక్,షైనీ గోల్డ్ కలర్లతో లభిస్తుంది.
Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్లు
Infinix Smart 8 Plus స్మార్ట్ ఫోన్ లో 6.6అంగుళాల HD +(1612x720 పిక్సెల్) IPS LCD డిస్ ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 500nits పీక్ బ్రైట్ నెస్ , 180hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది.డిస్ ప్లే పైభాగంలో ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB LPDDR4x RAM, 128 GB స్టోరేజ్ తో Media Tek Helio G 36 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఇంటర్నల్ మెమోరీని 1TB వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరా విషయానికి వస్తే.. ఫొటో గ్రఫీ కోసం ఫోన్ వెనక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా , f/2.0 ఎపర్చర్ తో కూడిన AI లెన్స్ ఉన్నాయి. సెన్సార్ల పక్కన LED ఫ్లాష్ మాడ్యుల్ కూడా ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ లో సెల్ఫీ లకోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంటుంది.
Infinix Smart 8 Plus స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో 6000mAh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్, XOS13తో రన్ అవుతుంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 5, GPS, బ్లూటూత్ V5.0, USB-C పోర్ట్,3.5mm హెడ్ ఫోన్ జాక్ సపోర్టుతో వస్తుంది.