హ్యాకర్ల చేతుల్లోకి వాట్సాప్: స్మార్ట్‌‌‌‌‌‌‌‌ ఫోన్లలో చొరబడుతున్న హ్యాకర్స్​

హ్యాకర్ల చేతుల్లోకి వాట్సాప్: స్మార్ట్‌‌‌‌‌‌‌‌ ఫోన్లలో చొరబడుతున్న హ్యాకర్స్​
  • కొరియర్, డెలివరీ పేర్లతో కాల్స్‌‌‌‌‌‌‌‌..కోడ్‌‌‌‌‌‌‌‌ పంపి ఓటీపీ అడుగుతున్నరు
  • వాట్సాప్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసుకుని ఫోన్​లోని కాంటాక్టులకు మెసేజ్‌‌‌‌‌‌‌‌లు
  • ఎమర్జెన్సీ పేరుతో డబ్బులు రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దోపిడీ
  • వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీ తప్పనిసరి: సైబర్ క్రైమ్ పోలీసులు  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వాట్సాప్‌‌‌‌‌‌‌‌ను సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేశారు. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ ఫోన్లలో చొరబడి అందులోని వాట్సాప్‌‌‌‌‌‌‌‌ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఫోన్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్ నంబర్స్‌‌‌‌‌‌‌‌తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. హ్యాక్ చేసిన నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డీపీ ఫిక్స్ చేస్తున్నారు. కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లోని వారికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.  అత్యవసరంగా డబ్బులు కావాలని వాట్సప్‌‌‌‌‌‌‌‌లోనే మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పంపిస్తున్నారు. గంటల వ్యవధిలో తిరిగి ఇస్తామని నమ్మిస్తున్నారు. 

ఇలా తమ ట్రాప్‌‌‌‌‌‌‌‌లో చిక్కిన వారి నుంచి అందినంత వసూలు చేస్తున్నారు. బాధితులు అప్రమత్తమయ్యే లోగా అకౌంట్ల నుంచి క్యాష్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకుంటున్నారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ హ్యాకింగ్ పెరిగిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్లు, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌ కాకుండా సెక్యూరిటీ సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.   

స్మార్ట్‌‌‌‌‌‌‌‌ ఫోన్లలో చొరబడి..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా మారింది. ఫోన్‌‌‌‌‌‌‌‌లో వాట్సాప్‌‌‌‌‌‌‌‌ కూడా కంపల్సరీగా ఉంటున్నది. సాధారంగా వాట్సాప్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌  చేసుకున్న సమయంలో సంబంధిత ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌ను‌‌‌‌‌‌‌‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఓటీపీ వస్తుంది. యూజర్స్‌‌‌‌‌‌‌‌ రిసీవ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ఓటీపీని తిరిగి సబ్​మిట్​ చేయగానే వాట్సాప్ యాక్టివేట్ అవుతుంది. దీంతోపాటు ఫోన్‌‌‌‌‌‌‌‌లో ఉండే బ్యాకప్‌‌‌‌‌‌‌‌ డేటా కూడా రిట్రీవ్‌‌‌‌‌‌‌‌ చేసుకునే అవకాశం ఉంటుంది.  

అయితే, చాలామంది యూజర్లు వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీ  ఫీచర్స్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించడం లేదు. సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌ లో టు సెటప్‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్ చేయడం లేదు. ఇదే సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశంగా మారింది. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేసి బాధితుల ఫోన్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌కి లింక్స్‌‌‌‌‌‌‌‌ పంపించడం లేదా మెసేజ్‌‌‌‌‌‌‌‌లు చేసి ఆయా ఫోన్ వాట్సాప్ డేటా హ్యాక్ చేస్తున్నారు.

వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ పేరుతో..

సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరగాళ్లు తమ సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లలో వాట్సాప్ డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌మీడియా,ఈ కామర్స్ సైట్లలో సేకరించిన ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆయా నంబర్లకు కొరియర్ డెలివరీ లేదా కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కాల్స్ చేస్తున్నామని చెప్తున్నారు. వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కోసం కోడ్‌‌‌‌‌‌‌‌, ఓటీపీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెండ్‌‌‌‌‌‌‌‌ చేశామని నమ్మిస్తున్నారు. 

తమ నుంచి రిసీవ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న కోడ్‌‌‌‌‌‌‌‌ చెప్పాలని అడుగుతున్నారు. ఇది నమ్మి ఓటీపీ చెప్పిన వారి నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఓటీపీ షేర్ చేయని వారి సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లోని వాట్సాప్‌‌‌‌‌‌‌‌ను హ్యాక్ చేస్తున్నారు. ఇలా హ్యాక్ చేసిన వాట్సాప్‌‌‌‌‌‌‌‌ను తమ మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్లలో యాక్టివేట్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. దీంతో అప్పటికే యాక్టివేట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బాధితుల ఒరిజినల్ నంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి వాట్సాప్‌‌‌‌‌‌‌‌ డీ యాక్టివేట్‌‌‌‌‌‌‌‌ అవుతున్నది.

ఆవారాల వేధింపులు ఇలా..

బాధితుల ఒరిజినల్​ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాట్సాప్‌‌‌‌‌‌‌‌ క్రెడెన్షియల్స్‌‌‌‌‌‌‌‌ కూడా చేంజ్​ చేస్తున్నారు. దీంతో ఓటీపీ ఇచ్చిన ఫోన్‌‌‌‌‌‌‌‌ యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాట్సాప్‌‌‌‌‌‌‌‌ డీ యాక్టివేట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. అదే వాట్సాప్‌‌‌‌‌‌‌‌ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఆపరేట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. ఇదే తరహాలో తెలిసిన నంబర్స్‌‌‌‌‌‌‌‌తో కొందరు ఆవారాలు ఫేక్ వాట్సాప్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేసిన కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మహిళలతో అసభ్యకరంగా చాట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.  తెలిసిన మహిళల నంబర్స్‌‌‌‌‌‌‌‌ నుంచే మెసేజ్‌‌‌‌‌‌‌‌ వస్తుండడంతో వాళ్లు అడిగిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది యువతులు వారి పర్సనల్‌‌‌‌‌‌‌‌ విషయాలను కూడా ఫేక్ వాట్సాప్‌‌‌‌‌‌‌‌ యూజర్స్‌‌‌‌‌‌‌‌కి చెప్తున్నారు. ఇలా ట్రాప్ చేసిన వారిని ఆవారాలు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.  

వాట్సాప్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌తో సైబర్ స్కెచ్‌‌‌‌‌‌‌‌

హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేసిన వాట్సాప్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ మొత్తం సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌ను బాధితుల కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ గ్రూపులో పరిశీలిస్తున్నారు. కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌లో  ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ లేదా సన్నిహితులను గుర్తిస్తున్నారు. బాధితులు తమ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో చేసిన విధంగానే చాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. హెల్త్‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీ ఉందనో  లేక ఇతర అవసరాలకు అత్యవసరంగా డబ్బులు కావాలనో రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌ పంపిస్తు న్నారు. లింక్స్‌‌‌‌‌‌‌‌ పంపించి క్లిక్‌‌‌‌‌‌‌‌ చేసేలా చేస్తున్నారు. ఇలా తెలిసిన వారి నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన లింక్స్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయడంతో వారి వాట్సాప్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ సైబర్​గాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. 

1930కి కాల్​ చేయాలి..

వాట్సాప్‌‌‌‌‌‌‌‌ హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌ అనేది వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఓటీపీ ఉంటేనే సాధ్యమవుతుంది. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేసుకునే సమయాల్లో సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ ప్రికాషన్స్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలి. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ సెట్టింగ్స్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో టు సెటప్‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ అనే ఆప్షన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. సీక్రెట్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పిన్‌‌‌‌‌‌‌‌ జనరేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌ గురైన బాధితులు వెంటనే మొబైల్ రీసెట్‌‌‌‌‌‌‌‌ చేసి https://www.whatsapp.com ద్వారా మళ్లీ కొత్తగా వాట్సాప్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేసుకోవాలి. కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నోళ్లను అలర్ట్​ చేయాలి. 1930 లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 

-కేవీఎం ప్రసాద్‌‌‌‌‌‌‌‌,
డీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో