![Rohit Sharma: నేరుగా నా గుండెల్లో గుచ్చావే.. భర్త కోసం రితికా అందమైన పోస్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/this-one-hit-straight-here-ritika-sajdeh-shares-beautiful-post-on-rohit-after-stunning-ton_tseHyG8Pjf.jpg)
పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రోహిత్ శర్మ ఎట్టకేలకు దారికొచ్చాడు. కటక్ గడ్డపై సెంచరీతో కదం తొక్కాడు. ఆదివారం(ఫిబ్రవరి 9) బారాబతి స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ మెరుపు శతకం బాదాడు. 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. 76 బంతుల్లోనే వంద మార్కు చేరుకున్నాడు. 338 రోజుల తరువాత అతని నుండి వచ్చిన శతకం ఇది. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ సతీమణి.. భర్త కోసం ఓ అందమైన పోస్ట్ నెట్టింట పంచుకుంది.
ఈ ఇన్నింగ్స్ రోహిత్‌కు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇటీవల కాలంలో అతను ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లు ఒక్కటీ లేవు. శ్రీలంకలో వన్డే సిరీస్ పరాజయం, సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఓటమి.. ఇలా అన్నింటిలోనూ జట్టుతో పాటు అతనూ తేలిపోయాడు. ఒకదశలో హిట్‌మ్యాన్ రిటైర్మైంట్ చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. వాటన్నింటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. తన సహజ ఆటతో పరుగుల మోత మోగించి విమర్శకుల నోళ్లు మూయించాడు.
Also Read :- బుర్ర పని చేస్తుందా..? హర్షిత్ రాణా ఓవరాక్షన్‌పై రోహిత్ సీరియస్
రోహిత్ 32వ సెంచరీ నేపథ్యంలో రితికా సజ్దే.. తన భర్త కోసం ఓ అందమైన పోస్టును తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. “ఇది నేరుగా ఇక్కడ తాకింది..” అని చెప్తూ రితికా హార్ట్ ఎమోజిని పోస్ట్ చేసింది.
Insta story of Ritika Sajdeh 🌟❤️ #INDvsENGODI #rohit pic.twitter.com/qCihUeDZiY
— ᴹᵃʸᵃⁿᵏ⁴⁵ (@ImMayank_45) February 9, 2025
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆతిథ్య జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య బుధవారం(ఫిబ్రవరి 12) అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే జరగనుంది.