పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నది పాకిస్థాన్కు చెందిన ఈ టెర్రర్ గ్రూపే

పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నది పాకిస్థాన్కు చెందిన ఈ  టెర్రర్ గ్రూపే

పహల్గాం దాడికి తామే పాల్పడ్డట్టు పాకిస్తాన్‌‌కు చెందిన టెర్రర్​గ్రూపు లష్కరే -తోయిబా స్థానిక శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్  (టీఆర్​ఎఫ్​) ప్రకటించింది. 2017 తర్వాత టూరిస్టులపై జమ్మూకాశ్మీర్​లో దాడి జరిగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే. ఉగ్రవాదులు అచ్చం 26/11 ముంబై దాడుల తరహాలో పహల్గాం అటాక్​కు తెగబడ్డారు. 

నలుగురైదుగురు టెర్రరిస్టులు ఆర్మీ, పోలీస్​ యూనిఫామ్​ ధరించి.. ముఖాలకు మాస్కులు పెట్టుకొని, తుపాకులతో టూరిస్టులున్న ఏరియాకు వచ్చారు. ‘మీది ఏ మతం’ అంటూ అడిగిన ప్రాణాలు తీశారు. కొందరు టూరిస్టులతో ప్రార్థనలు చేయించి.. కాల్చి చంపారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒకవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేసీ వాన్స్​ ఇండియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్​ టెర్రర్​ సంస్థ జమ్మూకాశ్మీర్​లో టూరిస్టులే లక్ష్యంగా కాల్పులు జరపడం కలకలం రేపింది. 

ALSO READ : పెళ్లై ఏడు రోజులే..భార్యతో హానీమూన్ కు వచ్చి ..ఉగ్రదాడిలో బలైన నేవీ అధికారి విషాదగాధ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి జమ్మూకాశ్మీర్​లో టూరిస్టులు తాకిడి పెరిగింది. త్వరలోనే అమర్​నాథ్​ యాత్ర ప్రారంభమవుతుండటంతో ఉగ్రదాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం మార్గంలో 48 కి.మీ, గండేర్బల్ జిల్లాలో 14 కి.మీ.లు సాగుతుంది. పహల్గాం మార్గంలోని బైసరన్​లోనే ప్రస్తుతం ఉగ్రదాడి జరిగింది.  భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. జమ్మూకాశ్మీర్​ ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్​ లైన్​ను ఏర్పాటు చేసింది.