బతికేదెట్లా : ఈ ఫొటోలో ఉన్న గది అద్దె రూ.10 వేలు.. కిటికిలు కూడా లేవు..

బతికేదెట్లా : ఈ ఫొటోలో ఉన్న గది అద్దె రూ.10 వేలు.. కిటికిలు కూడా లేవు..

ఓసారి పైన ఫొటో చూడండి.. బాగా చూడండి.. ఎందుకంటే ఈ ఫొటోలో కనిపించే మొత్తం స్థలమే అతని నివాసం.. అతని ఇల్లు.. అతని గది.. అవును.. ఇంత చిన్న గదికి 10 వేల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు.. మన ఇండియా రాజధాని ఢిల్లీలో.. అవాక్కయ్యారా.. ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక్కరు అంటే ఒక్కరు మాత్రమే పట్టే చిన్న మంచం.. ఆ పక్కనే చిన్న టేబుల్.. దానిపైన అతిచిన్న టేబుల్ ఫ్యాన్.. గోడకు మరో ఫ్యాన్ ఉంది.. ఓ చిన్న అల్మారా ఉంది. కిటికీలు లేవు.. బాత్రూం లేదు.. జస్ట్ వచ్చి పడుకుని వెళ్లటానికి మాత్రమే సరిపోతుంది.. బాత్రూం అంటారా.. ఆ కాంపౌండ్ లోని 10 మంది ఉపయోగించుకునే టాయిలెట్ ను ఉపయోగించుకోవాలి.. దీనిని అద్దెకు తీసుకున్నది ఎవరో తెలుసా.. గ్రూప్స్ కోచింగ్ తీసుకోవటానికి దేశ రాజధాని వచ్చిన ఓ స్టూడెంట్.. కనీసం కిటికీలు కూడా లేవు.. చాలా ఇబ్బందిగా ఉంది.. ఇంత కంటే బెటర్ గా ఉండే ఓ గది లేదా ఇల్లు ఉంటే చెప్పండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంలో వైరల్ అయ్యింది. 

Also Read:-హైదరాబాద్ సిటీలో భారీగా ఇండ్ల అమ్మకాలు

ఢిల్లీలోని రాజేందర్ నగర్, ముఖర్జీ నగర్ ఏరియాల్లోని పరిస్థితి ఇది. ఈ ప్రాంతాల్లో సివిల్స్, గ్రూప్ ఎగ్జామ్స్ కోసం వేలాది మంది స్టూడెంట్స్ నిత్యం వస్తుంటారు.. దీంతో ఆయా ప్రాంతాల్లో స్టూడెంట్స్ హాస్టల్స్, గదులు, ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అసలు అద్దెకు ఇల్లు దొరకటమే ఆ ప్రాంతంలో కష్టం అంట.. దొరికినా ఇలాంటివి ఉంటాయంట.. పైన చూపించిన గది కూడా ఓ బిల్డింగ్ సెల్లారులోనిది అంట.. 

రిషబ్ తివారీ అనే స్టూడెంట్స్ చేసిన ఎక్స్ పోస్టుతో ఇది వైరల్ అయ్యింది. ఢిల్లీ నెటిజన్లు అయితే విపరీతంగా స్పందించేశారు. రాజేందర్ నగర్ నుంచి నాలుగు, ఐదు కిలోమీటర్ల దూరం వెళితే మంచి ఇల్లు, గదులు దొరుకుతాయని.. మెట్రో కూడా ఉందని.. డోంట్ వర్రీ అంటూ దైర్యం చెబుతున్నారు. మరికొందరు అయితే రాజేందర్ నుంచి మొదట బయటకు రండి.. చుట్టూ చాలా ప్రశాంతమైన ప్రాంతాలు ఉన్నాయి.. కిటికీలు కూడా లేని గదిలో ఉండటం మంచిది కాదు.. ఆరోగ్యం దెబ్బతింటుంది అంటూ సలహా ఇస్తున్నారు. ఏదిఏమైనా దేశ రాజధాని ఢిల్లీలో స్టూడెంట్స్ కు అద్దె గదులు, ఇల్లు దొరకటం ఎంత కష్టమో ఈ పోస్టుతో స్పష్టం అయ్యింది.