30 ఏళ్ల తర్వాత... అరుదైన ముహూర్తంలో ఈ దసరా..

ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం మొదటి రోజు నుండి తొమ్మిది రోజులపాటు  నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ ఏడాది (2023)  అక్టోబర్ 15 నుండి 24 వరకు దసరా నవరాత్రిళ్లు  జరుపుకుంటారు. ఇది 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో, దుర్గా దేవిని తొమ్మిది రూపాలలో  పూజిస్తారు.  అయితే ఈ ఏడాది వచ్చిన దసరా ముహూర్తం 30 సంవత్సరాల వచ్చిందని పండితులు చెబుతున్నారు.

చాంద్రమానం ప్రకారం శోభకృత్ నామ సంవత్సరంలో (2023) దుర్గాదేవి ఏనుగుపై భూమిని దర్శించనుందని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం నవరాత్రులు 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన  ఆధ్యాత్మిక వేత్తలు. ఈ సంవత్సరం నవరాత్రుల మొదటి రోజున, బుధ ఆదిత్య యోగం, షాష రాజ్యయోగం ,  భద్ర రాజ్యయోగం అనే శుభ యోగాలున్నాయంటున్నారు పండితులు.  ఈ యోగాల కలయిన చాలా విశిష్టమైనదట.  అంతేకాకుండా నవరాత్రిళ్ల సమయంలో ఇలాంటి  రోజు ఉన్నందున ఎంతో పవిత్రమైనదని చెబుతున్నారు.  ఈ ఏడాది తగినన్ని వర్షాలు కురుస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, ప్రసంగం, తర్కం, వ్యాపారం, వాణిజ్యం మరియు ఇతర సంబంధిత విషయాలకు చిహ్నంగా పరిగణిస్తారు.  రాజులు, తండ్రులు, ప్రభుత్వాలు మరియు ఉన్నత పరిపాలనా స్థానాలకు ఏకకాలంలో సూర్యుడు కూడా కారకంగా బుధ ఆదిత్య యోగంగా పరిగణిస్తారు.   సూర్యుడు దీనికి అదనంగా ఒక వ్యక్తికి శక్తిని మరియు జీవిత శక్తిని కూడా ఇస్తాడు. ఈ రెండు అత్యంత శక్తివంతమైన గ్రహాలు ఇలాంటి నేపధ్యంలో కలిసి వచ్చినప్పుడు, స్థానికుల జీవితాలు వాణిజ్యపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి సంబంధించి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  బుధుడు, సూర్యుడు అక్టోబర్ 15 న ఒకే ఇంటిలోకి వస్తారని అందుకే బుధ ఆదిత్య యోగం కూడా ఆరోజు ఉంటుందని చెబుతున్నారు. 

శని గ్రహం అక్టోబర్ 15 వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చేసి 180 రోజులు అదే రాశిలో ఉంటాడట.   జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.   శనితో పాటు మరో రెండు గ్రహాలు 6 నెలల పాటు కుంభరాశిలోనే ఉంటాయని చెబుతున్నారు. ఈ మూడు గ్రహాలు తిరోగమనం వలన కేతు షాష రాజ్యయోగం  ఫలితాలు ఉంటాయని   నిపుణులు చెబుతున్నారు. 

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. జాతక కుండలిలో పంచ మహా పురుష యోగాకు చాలా ప్రాముఖ్యత ఉంది. జాతకంలో బుధుడు, కుజుడు, గురు, శుక్రుడు, శని గ్రహాలు  బలమైన స్థానంలో ఉన్న సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ పంచ మహాపురుష యోగాలు.. బృహస్పతితో హంస యోగం, బుధునితో భద్ర యోగం, శుక్రుడుతో మాలవ్య యోగం, కుజుడు ద్వారా రుచక్ యోగం, శని ద్వారా శాస యోగాలు ఏర్పడనున్నాయి.  ఈ కారణంగా అక్టోబర్ 15న భద్ర రాజయోగం ఏర్పడనుంది. 

ఏనుగు తల  గణేశుడితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. వినాయకుడు విఘ్నాలను తొలగించువాడు.   అంతే కాకుండా ఏనుగు జ్ఞానం, ఆనందం, సంపద, మంచి ఆరోగ్యానికి చిహ్నంగా ఉంటుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.    కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠంచి నవరాత్రిళ్లు జరిపేందుకు శ్రీకారం చుట్టారు మండపాల నిర్వాహకులు.

దుర్గాదేవి భూమిపైకి వచ్చే వాహనాన్ని బట్టి పంచాగకర్తలు, జ్యోతిష్కులు భవిష్యత్ కాలాన్ని లెక్కగడతారట.   దుర్గా మాత  వాహనం సింహం అయినా... ప్రతి దసరా పండుగకు ఒక్కో దానిపై అమ్మవారు సవారీ చేస్తారట.  దసరా సమయంలో కొంతమంది దీక్షతీసుకొని తొమ్మిది కఠిన నియమాలు పాటిస్తారు. ధూమపానం, మద్యపానం,జూదం మొదలైన వాటికి దూరంగా ఉండి.. బ్రహ్మచర్యం పాటిస్తారు.  నిత్యం బ్రహ్మ ముహూర్తాన (తెల్లవారు జామున 4.30 గంటలకు) అమ్మవారిని ఆరాధిస్తారు.