ఇత్తు ముందా... చెట్టు ముందా... గుడ్డు ముందా.. కోడి ముందా... ఇలాంటి ప్రశ్నలకు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు సమాధానం చెబుతారు. అయితే భూమి విషయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొన్ని కీలక విషయాలు వెల్లడించింది.
భూమి మొత్తం మహాసముద్రాలు మాత్రమే ఉన్న ఒక కాలం ఉంది. ఉపరితలంపై నీరు మాత్రమే ఉంది. మొట్టమొదట బయటకు వచ్చిన భూమి ఏంటో తెలుసా? శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సముద్రంలో నుంచి మొదట బయటకు వచ్చిన ప్రాంతం భారతదేశంలోనే ఉందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
కృతయుగం.. త్రేతా యుగం.. ద్వాపర యుగం.. కలియుగం.. ఇలా చెప్పుకుంటే పోతే పురాణాల ప్రకారం ఇప్పుడు కలియుగం జరుగుతుంది. అంతకంటే ముందు.. అసలు భూమే లేదట.. ఇప్పుడున్న భూ ప్రపంచమంతా సముద్రాలు.. మహా సముద్రాలు ఉన్నాయని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోతి నుంచి మానవుడు జన్మించినట్లు.. భూమి మహాసముద్రం నుంచి ఉద్భవించిందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రొసీడింగ్స్ పరిశోధించిన అధ్యయనంలో తేలింది. అంతేకాదు... భూమికి మొట్ట మొదట భారతదేశంలోనే గుర్తించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రెండు కీలక విషయాలు వెల్లడించింది. అందులో ఒకటి..మహాసముద్రం నుంచి .. భూమిని మొదటిసారి 700 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిదని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించిది. రెండవది 3.2 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో నుంచి భూమి మొదట భారతదేశంలో గుర్తించారని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. భారతదేశం, ఆస్ట్రేలియా , యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తలు భూమి వాతావరణంతో సంబంధం ఉన్న తొలి క్రస్ట్ గురించి పరిశోధనలు చేశారు.
ఈ పరిశోధనల్లో భాగంగా జార్ఖండ్ లోని సింగ్ భూమి ప్రాతంలోని ఇసుక రాళ్లను సేకరించి వాటిపై ప్రయోగాలు జరిపారు. ఇవి 3 బిలియన్ సంవత్సరాలకు ముందు కాలంనాటివని... పురాతన నదీ మార్గాలు.. టైడల్ ఫ్లాట్లు.. అప్పుడున్న బీచ్‌ల భౌగోళిక ఆధారాలను విశ్లేషించి కనుగొన్నారు. మహాసముద్రం నుంచి సింగ్ ప్రాంతంలో ల్యాండ్ మైన్ ను అంటే ఇసుక రాళ్లు.. గ్రానైట్ లాంటి నిక్షేపాలను గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
3.2 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి క్రస్ట్ క్రింద వేడి శిలాద్రవం క్రస్ట్ అక్కడున్న నీటిని.. రాళ్లను చిక్కగా చేసింది. ఇది సిలికా ... క్వార్ట్జ్ వంటి తేలికైన పదార్థాలతో తయారైందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించింది. దాని చుట్టూ రాళ్ల కంటే మందంగా .. భౌతికంగా ఇప్పుడున్న భూమి ఆకారంలో ఉందన్నారు . తరువాత ఆ ప్రాంతంలో నీరు అక్కడ వెలువడే వేడి శిలాద్రవం ద్వారా ఇంకిపోయి.. భూమి మాదిరిగా ఏర్పడిందన్నారు. ఆ క్రస్ట్ క్రమేణ వ్యాపిస్తూ దాదాపు 50 కిలోమీటర్ల వరకు చిక్కగా, నీటిపై మంచుకొండలాగా తేలిందన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోశధనల్లో భూమి మహాసముద్రం నుంచి ఉద్భవించిందని.. అదీ కూడా భారతదేశం..జార్ఖండ్ రాష్ట్రంలో సింగ్ ప్రాంతంలో మొదట చిన్న రాళ్లగా ఏర్పడిందని తెలిపారు.