RCB: అందుకే బెంగళూర్ కప్ కొట్టడం లేదు.. లోపం ఎక్కడో కరెక్ట్గా చెప్పేశాడు ఈ సీనియర్

RCB: అందుకే బెంగళూర్ కప్ కొట్టడం లేదు.. లోపం ఎక్కడో కరెక్ట్గా చెప్పేశాడు ఈ సీనియర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ లో క్రేజ్ ఎక్కువగా ఉన్న టీమ్ లలో ఒకటి. ప్రతి సీజన్ లో టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతుంటుంది. ‘‘ఈ సారి పక్కా కప్పు కొడుతుంది’’ అని ప్రతీసారి ఫ్యాన్స్ బెట్టింగ్స్ వేస్తుంటారు. కోహ్లీ ఫ్యాన్స్ అయితే.. ‘‘కోహ్లీ కోసమైనా కప్ రావాలి. కోహ్లీ ఉన్న టీమ్ కు కప్ రాకపోవడమేంటి’’ అని చర్చిస్తుంటారు. లీగ్ దశను ఈజీగా దాటేసి చివర్లో కప్ మిస్ చేసుకుంటుంది ఈ టీమ్. అయితే RCB కప్ ఎందుకు కొట్టలేకపోతుందో ఓ ప్లేయర్ కరెక్ట్ గా విశ్లేషించాడు. ఇది అందరూ చెప్పేదే అయినప్పటికీ.. వెరీ రీజనబుల్ గా అనిపించాయి. 

బెంగళూర్ టీమ్ ఐపీఎల్ లో సింగిల్ ట్రోఫీ కూడా కొట్టకపోవడానికి కారణం ఫ్రాంఛైజ్ ముఖ్యంగా ఇద్దరు లేదా ముగ్గురు ప్లేయర్లపైనే ఫోకస్ పెట్టడమే కారణం అని RCB కి 2014లో ఆడిన షాదాబ్ జకాతి అన్నాడు. ఆ స్ట్రాటజీ ఎప్పటికీ వారికి వర్కవుట్ కాదని చెప్పాడు. దీంతో పాటు చాలా విలువైన విశ్లేషణ చేశాడు ఈ మాజీ ప్లేయర్. 

గతంలో టీమ్ కేవలం విరాట్ కోహ్లీ పైన ఆధారపడటం, ఒకరిద్దరు విదేశీ ఆటగాళ్లపైన ఆధారపడటం కూడా విమర్శలకు దారితీసింది. టీమ్ కంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్.. చెన్నై టీమ్ ను చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. 

ALSO READ | NZ vs PAK: ఫ్యూచర్ స్టార్ అని సెలక్ట్ చేస్తే వరుస డకౌట్లు.. పాక్ ఓపెనర్‌కు చేదు అనుభవం

‘‘క్రికెట్ అనేది టీమ్ గేమ్. ఒకరిద్దరిపై ఆధారపడితే ట్రోఫీలు రావు. అందరూ ఒక యూనిట్ గా, కలిసికట్టుగా భాగస్వామ్యం పంచుకుంటేనే సక్సెస్ అవుతాం. చెన్నై లో చాలా మంది బలమైన ఇండియన్ ప్లేయర్లు ఉంటారు. ఒకరిద్దరు ఫారిన్ ప్లేయర్లుంటారు. అందరి మధ్య కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ నేను ఆర్సీబీలో ఉన్నపుడు టీమ్ మొత్తం ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లపైనే ఆధారపడేది. ఇప్పటికీ అదే జరుగుతోంది’’ అని చెప్పాడు జకాతి. 

టీమ్ మేనేజ్ మెంట్, డ్రెస్సింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే చాలా తేడా ఉంటుందని అన్నాడు జకాతి. ప్లేయర్స్ చాలా గొప్పగా ఉంటారు. కానీ డ్రెస్సింగ్ రూమ్ లో ఆ సాన్నిహిత్యం ఉండదని.. ప్లేయర్స్ ఫ్రెండ్లీగా లేకపోవడం మంచిది కాదని అన్నాడు. అది చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. 

2010లో చెన్నై టీమ్ లో ఆడిన జకాతి.. ఈ రెండు మేనేజ్ మెంట్ల గురించి కామెంట్ చేశాడు. ‘‘చెన్నై మేనేజ్మెంట్ ప్లేయర్లకు చాలా విలువ ఇస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే వాళ్లు 5 సార్లు కప్పు గెలిచారు. ఇవి చిన్న విషయాలే కానీ చాలా ప్రభావం చూపిస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కు ఉన్న తేడా ఇదే’’నని విశ్లేషించాడు ఈ సీనియర్ ప్లేయర్.