Good Health : రక్తం పెరిగి.. బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలి ..!

థైరాయిడ్ సమస్యలు.. హార్మోనుల ఉత్ప త్తిలో తేడాల వల్ల వస్తాయి. ఆహారం ద్వారా ఈ సమస్య లు తగ్గవు. అలాంటి వాదానికి ఎలాంటి వైజ్ఞా నిక ఆధారాలు లేవు. అయొ డైజ్డ్ సాల్ట్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ రావడం చాలా అరుదు. ఆ ఒక్క కారణంతో అందరూ అయోడైజ్డ్ ఉప్పు మానుకోవాలనుకోవడం తప్పు. మన ఆహారం నుంచి అయోడిన్ అందుతుంది. కాబట్టి ఉప్పు ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. పంటలు బాగా పండించడం వల్ల ఆహారంలో ఖనిజ లవణాలు తక్కువగా ఉంటు న్నాయి. ఇప్పుడు ఆహారంలో అదనపు అయోడిన్ (ఉప్పు ద్వారా) చేర్చాల్సిన అవసరం ఉంది. 

రక్తం పెరగాలంటే..

చాలామంది బలహీనంగా ఉండటానికి కారణం రక్త హీనత. బాగా తింటే లావు పెరుగుతామని, బలం పెరుగుతుందనుకుంటారు. ఆహారం ఎంత తిన్నా ఆ సమస్య తీరదు. మన దగ్గర ఎనీమియా (రక్త హీనత) సమస్య ఎక్కువగా ఉంది. ఆహారంలో దాదాపుగా ఐరన్ తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా పండించే పంటలన్నిటిలో ఐరన్ తగ్గుతున్నట్లుగా గుర్తించాం. ఐరన్ కోసం మాంసాహారం తినాలి. రక్త హీనతకు ఐరన్ ఒక్కటే కాదు. విటమిన్-బీ9, విటమిన్-బీ12 కారణమే.

బలం తగ్గిందా?

బలంగా లేమని ఆహారం గురించి ఆలోచించేవా ళ్లు శరీరంలో ఉన్న సమస్యల్ని కూడా గుర్తించాలి. నులి పురుగుల వల్ల, శరీరం ఐరన్ లోపాన్ని ఎదుర్కొంటుంది. ఎంత తిన్నా అది ఒంటబట్టదు. పిల్లలు, పెద్దలు అప్పుడప్పుడు (మూడు, నాలుగు నెలలకు ఒకసారి) నులి పురుగుల నివారణకు మందులు, కషాయాలు తీసుకోవడం మంచిది.