స్టాక్ మార్కెట్లో సంచలనం..ఒకే ఒక్క ట్రేడింగ్ తో టాప్ కు చేరుకుంది. అంతగా పరిచయం లేని స్మాల్ క్యాప్ స్టాక్..పెట్టబడిదారులకు అనూహ్య లాభాలను సంపాదిం చిపెట్టింది. అక్టోబర్ 29 న ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ దాని షేర్ ధరలో అనూహ్యమైన పెరుగుదల చవిచూసింది.
కేవలం ఒకే ఒక్క ట్రేడింగ్ లో BSE లో షేర్ ధర రూ. 3.53 లనుంచి రూ. 2లక్షల 36వేల 250 కి చేరుకుంది. కొన్ని నెలల క్రితం ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ షేర్లలో రూ. 1లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని షేర్ ధర పెరిగిన తర్వాత రూ.670 కోట్లకు చేరుకుంది.
ఈ అసాధారణ పెరుగుదల ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ ను భారత దేశపు అత్యంత ఖరీదైన స్టాక్ గా మార్చింది. టైర్ల తయరీ సంస్థ MRF లిమిటెడ్ షేర్ దర రూ. 1.22 లక్షలు దాటేసింది.
Also Read :- ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్
హోల్డింగ్ కంపెనీల ధరల ఆవిష్కరణ కోసం బీఎస్ ఈ వేలం తర్వాత ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స షేర ధరలో రూ. 66లక్షల 92వేల 535 శాతం పెరుగుదలను చూసింది. దీంతో ఎల్సిడ్ ఒక్కో షేర్ ధర రూ. 2.25 లక్షలకు చేరింది.
అదే సమయంలో ఎల్సిడ్ షేర్లు గరిష్టంగా రూ. 4.58 లక్షల ట్రేడెడ్ విలువను కలిగి ఉన్నాయి. చివరికి ఒక్క షేరు కు రూ. 2.25 లక్షల వద్ద స్థిరపడింది.
దీనికి ముందు ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ జూన్ 21న మాత్రమే ట్రేడ్ అయ్యాయి. అప్పుడు కేవలం 500 షేర్లు ఒక్కొక్కటి రూ. 3.53 చొప్పున మాత్రమే ట్రేడ్ అయ్యాయి. 2024 జూలైలో ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఒక్కొక్కటి రూ. 3.21 విలువైన పెన్నీ స్టాక్ గా పరిగణించబడింది. ప్రస్తుతం ఎల్సిడ్ ఇన్వెస్ట్ మెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 52వేల 010కోట్లుగా ఉంది.