
మామా ఏక్ పెగ్ లావో.. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే బార్లు, పబ్స్, వైన్ షాపుల దగ్గర ఈ డైలాగ్ కామన్.. ఇందుకు విరుద్ధంగా చలికాంలోనూ.. బీరు అమ్మకాల్లో దేశంలోనే రికార్డ్ సృష్టించింది మన సౌతిండియాలోని ఓ స్టేట్. అది తెలంగాణ మాత్రం కాదు.. ఇంకేంటి అంటారా మన పక్క రాష్ట్రం కర్నాటకలోనే..అక్కడి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ సైతం ఆశ్చర్యపోయే విధంగా..అవాక్కయ్యే విధంగా చలికాలంలో బీర్ల అమ్మకాలు ఏకంగా 10 శాతం పెరిగాయి..ఎనిమిది నెలల్లోనే.. కర్నాటక స్టేట్ లో 313 లక్షల కార్టన్లు.. ఒక్కో కార్టన్ లో 12 బీరు సీసాలు.. అంటే ఎన్ని బీరు సీసాలు ఖాళీ చేసి ఉంటారో ఊహించుకోండి.. గత ఏడాది ఇదే కాలానికి 282 లక్షల కార్టన్లు మాత్రమే అమ్ముడుపోగా.. ఈ ఏడాది రికార్డు బద్దలు కొడుతూ.. సౌత్ ఇండియానే అత్యధికంగా బీరు అమ్మకాలు చేసింది కర్నాటక స్టేట్.. ఈ పూర్తి వివరాలు ఇలా..
తాజా రిపోర్టుల ప్రకారం.. కర్ణాటకలో విస్కీ, రమ్ కంటే బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. వింటర్ సీజన్ కదా.. ఎక్కువ మంది లిక్కర్ ను తాగుతారనుకుంటే ఇందుకు విరుద్ధంగా బీర్ల అమ్మకాలు గతంకంటే 10 శాతం పెరిగాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మద్యం అమ్మకాలు 0.6శాతం తగ్గితే.. బీర్ల అమ్మకాలు మాత్రం ఎక్సై్జ్ శాఖ అవాక్కయ్యేలా 10.9 శాతం పెరిగాయట.
కర్ణాటక మందుబాబులు తాగిన బీర్ల లెక్కలను అక్కడి ఎక్సైజ్ డిపార్టుమెంట్ చెప్పుతూ అవాక్కయింది. కేవలం 8 నెలల కాలంలో 466 లక్షల కార్టన్లు బీర్లు తాగారట. గతేడాది ఇదే సమయంలో కేవలం 282 లక్షల కార్టన్ల బీర్లు మాత్రమే అమ్ముడు పోయాయని చెపుతున్నారు ఎక్సైజ్ అధికారులు.
కర్ణాటలో మద్యం అమ్మకాలతో రెవెన్యూ లోటు 200 కోట్లు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 2024-25 లో మద్యం అమ్మకాల ద్వారా రూ . 38వేల 525 కోట్ల ఆదాయం తేవాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందట.. ఏదీ ఏమైనా బీర్ల అమ్మకాలు భారీగా పెరగడం వారి టార్గెట్ కూడా నెరవేరుతుందని ఎక్సైజ్ అధికారులు ఖుషీగా ఉన్నారట.