విహార యాత్రలకు వెళ్లినప్పుడు, సెలవుల్లో కొంత మంది బోర్ గా ఫీలవుతుంటారు. ఈ ఫీలింగ్ ను కొంత వరకు సెల్ ఫోన్లు కవర్ చేసినా.. ఔట్ డోర్ లో కొంచెం ఇబ్బందికరమే.. అలాంటి సమయాల్లో టీవీ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి వారికోసం ఓ శుభవార్త.. సూట్ కేస్ టీవీ అందుబాటులోకి వస్తోంది. ఈ సూట్ కేస్ టీవీని ఎక్కడికైనా సులభంగా మోసుకెళ్లొచ్చు.. ఎలాంటి వాతావరణంలో అయినా చూడొచ్చు. మీకు ఎలాగంటంటే అలా మడత పెట్టుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సెలవులు, విహార యాత్రలు చేసేవారికి ఇది అత్యంత విలువైన ఎంటర్ టైన్ మెంట్ డివైజ్.. దీనిని దక్షిణ కోరియాకు చెందిన టెలివిజన్ దిగ్గజం LG తయారు చేసింది. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.. దాని వివిరాలేమిటో చూద్దాం..
దక్షిణ కొరియా టెలివిజన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ LG.. ఈ వింత ఆవిష్కరణకు అందుబాటులోకి తెచ్చింది. ఇది 27-అంగుళాల LED టచ్‌స్క్రీన్.. ఒక చిన్న సూట్‌కేస్ వంటి ప్రత్యేక కేస్‌లో అమర్చి ఉంటుంది. ఈ ఆల్ ఇన్ వన్ టెలివిజన్ ను ఎక్కడంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇందులో వీడియో గేమ్ లు కూడా ఆడుకోవచ్చు. ఇది చాలా రకాల ఎంటర్ టైన్ మెంట్లకు మూలం.
ఈ సూట్ కేస్ టెలివిజన్ ను ఎలాంటి వాతావరణంలోనైనా వినియోగించవచ్చు.. ఎంజాయ్ చేయొచ్చు. కేస్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ను సులభంగా పైకి లేపవచ్చు.. అటుఇటు తిప్పవచ్చు. వంచవచ్చు. పోర్ట్రెయిట్ మోడ్ లోకి మార్చుకోవచ్చు.. లేదా జాయింట్ టాబ్లెట్ పీసీ గా ఫ్లాట్ గా కూడా ఉంచొచ్చు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఇన్ బుల్ట్ అయిన స్పీకర్లు స్క్రీన్ స్థానానికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకుంటాయి.
సంబంధిత హార్డ్‌వేర్‌లన్నింటినీ ఒకే కేస్‌లో ప్యాక్ చేసి సోషల్ మీడియాను ఎంజాయ్ చేయడం.. ఎక్కడ ఉన్నా తగిన- మీకు నచ్చిన పరిమాణంలో స్క్రీన్‌పై ఇష్టమైన షోలను చూడగలగడం అనేది ఈ డివైజ్ తోనే చాలా సులభం. ఈ ఆవిష్కరణతో మీరు మూవింగ్లో ఉన్నప్పుడు ఇల్లు లేదా స్మార్ట్ ఫోన్ స్క్రీన్కు మాత్రమే పరిమితం కాదని రుజువైంది. StanbyME Go అనేది WiFi ,బ్లూటూత్‌లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు మీకు ఇష్టమైన అన్ని షోలను ఆస్వాదించవచ్చు. ఇది AirPlayకి మద్దతు ఇస్తుంది. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ కోసం iOS , Android పరికరాలతో పని చేస్తుంది.
ఈ డివైజ్ USలో $1,000కి రిటైల్ అవుతోంది. అంటే మన ఇండియా దాదాపు 80 వేలు రూపాయలన్నమాట.