- సిట్టింగ్ఎమ్మెల్యేపై గుర్రుగా సొంత పార్టీ నేతలు
- బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందంటున్న కాంగ్రెస్
- అదృష్టాన్ని పరీక్షించుకోనున్న బీజేపీ
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి వారసులు పోటీకి దిగుతున్నారు. ఏడుసార్లు కాంగ్రెస్ఎమ్మెల్యేగా గెలిచిన కుందూరు జానారెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన రెండో కొడుకు జయవీర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా సాగర్బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ మరోసారి పోటీ చేస్తున్నారు. నాగార్జునసాగర్ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య 2021లో చనిపోగా, బైఎలక్షన్స్‌లో ఆయన కొడుకు భగత్పోటీ చేసి గెలిచారు. అక్కడి నుంచి భగత్పొలిటికల్కెరీర్మొదలైంది. జయవీర్, భగత్ఇద్దరి వయస్సు 40 ఏళ్లు లోపే. వీరిద్దరూ నియోజకవర్గంలోని యువ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. సాగర్‌లో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బైఎలక్షన్స్‌లో భగత్ కు అండగా నిలిచిన యువకులు ఈసారి ఎటువైపు ఉంటారో వారినే విజయం వరించే అవకాశముంది. అధికారపార్టీపై ఉన్న అసమ్మతి తమకు కలిసిసొస్తుందని కాంగ్రెస్నాయకులు భావిస్తున్నారు. బైఎలక్షన్స్‌లో బీసీల ఓట్లు ఎక్కువగా పడ్డాయని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, ఈసారి కూడా వారి మీదే నమ్మకం పెట్టుకున్నారు.
కాంగ్రెస్‌లోకి పాత క్యాడర్..
జానారెడ్డి ఓటమితో గతంలో కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన నేతలంతా తిరిగిరావడంతో కాంగ్రెస్‌కు కొండంత బలం వచ్చినట్లయింది. వరుసగా రెండు ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న క్యాడర్ ఎలాగైనా ఈసారి ఆయన కొడుకు జయవీర్‌ను గెలిపించుకోవాలనే కసితో పనిచేస్తోంది. అధికారపార్టీలో సిట్టింగ్ఎమ్మెల్యే భగత్ పై ఉన్న అసమ్మతిని తమకు అనుకూలంగా మలుచుకుంటుకున్న జానా, ఆయన కొడుకు జయవీర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. జయవీర్ సాగర్కేంద్రంగా ఇంటర్నల్పాలిటిక్స్ నడిపిస్తున్నారు. జానారెడ్డి కూడా నేతలు, క్యాడర్‌తో వరుసగా భేటీ అవుతున్నారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడైన ఎంసీ కోటిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యే భగత్‌కు, కోటిరెడ్డికి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్లు భగత్‌కు అండగా నిలిచిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలు కూడా ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్తున్నారు. ఇవన్నీ జయవీర్గెలుపుకు కలిసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీసీ సెంటిమెంట్‌పైనే బీఆర్ఎస్ ఆశలు..
ఉప ఎన్నికల్లో ప్రయోగించిన బీసీ సెంటిమెంట్ అస్త్రంపైనే ఎమ్మెల్యే భగత్ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కేసీఆర్కోదాడ సభలో కూడా బీసీ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. అక్కడి అధికార పార్టీ క్యాండేట్మల్లయ్య యాదవ్‌పై అగ్రకుల నేతల కుట్ర పన్నారని, బీసీలు ఏకమై మల్లయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. సాగర్‌లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇక్కడ రెడ్డి వర్గీయులతో పాటు బీసీ సామాజిక వర్గాలు కూడా భగత్‌కు వ్యతిరేకంగా వాయిస్వినిపిస్తుండడం బీఆర్ఎస్కు నెగెటివ్‌గా మారింది. కాగా, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ఈసారి తనను గట్టెక్కిస్తాయనే ధీమాలో భగత్ఉన్నారు. సీనియర్లు విభేదిస్తున్నా.. యువకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని బలమైన నాయకులు భగత్వెన్నంటే ఉన్నారని, ఉప ఎన్నికల నాటి పరిస్థితులకు, ఇప్పటికీ వ్యత్యాసం చాలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకులంతా తరలివచ్చి భగత్తరఫున ప్రచారం చేశారు. ఈసారి భగత్ సింగిల్ గా ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంది. మరోవైపు 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 7,726 ఓట్ల మెజార్టీ సాధించగా, భగత్‌కు 18,672 ఓట్ల మెజార్టీ వచ్చింది. జానారెడ్డిని రెండు సార్లు ఓడించిన చర్రిత నోముల ఫ్యామిలీకే ఉంది.
కమలం వికసించేనా?
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య కంకణాల నివేదితారెడ్డి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు కేవలం 2,682 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఉప ఎన్నికల్లో టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎస్టీలకు అవకాశం దక్కింది. బీజేపీ నుంచి డాక్టర్రవి నాయక్ పోటీ చేయగా, కేవలం 7,676 ఓట్లు దక్కాయి. రెండు ఎన్నికల్లోనూ బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు. రెండోసారి పోటీ చేస్తున్న నివేదితారెడ్డికి లేడీస్ సెంటిమెంట్ కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఆమె గడపగడపకు తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నేత రిక్కల ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన మరో బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనమడు సాగర్ బీజేపీ టికెట్ రంజిత్ యాదవ్ ఆశించినా చివరికి నివేదితాకే టికెట్ దక్కింది. ఈ క్రమంలో రిక్కల ఇంద్రసేనారెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు.