మిర్చి క్వింటా  రూ.80 వేలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈసారి మిర్చికి ఫుల్ డిమాండ్ ఉంది. సీజన్ ప్రారంభంలోనే రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లకు 6,677క్వింటాళ్ల మిర్చి రాగా భారీగా ధర వచ్చింది. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేవలం నాలుగు క్వింటాళ్ల దేశీ రకం మిర్చి రాగా, క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.80,100 చొప్పున రికార్డు ధర పలికింది. ఇదే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రకం 19 క్వింటాళ్లు రాగా గరిష్టంగా క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.37 వేలు, కనిష్టంగా రూ.31 వేలు పలికింది. హైదరాబాద్ లోని మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రకం 370 క్వింటాళ్లు రాగా క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు గరిష్టంగా రూ.23 వేలు దక్కింది. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 341 రకం క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.26 వేలు పలికింది. క్వింటాల్ తేజ రకం మిర్చికి ఖమ్మంలో రూ.21 వేలు, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.20 వేలు దక్కింది. కాగా, సాధారణంగా పాత మిర్చి ఎక్కువ ధర పలుకుతుంది. కానీ ఈసారి మార్కెట్ లోకి వస్తున్న కొత్త మిర్చికి కూడా అత్యధిక ధర దక్కుతోంది. అదే విధంగా తాలు మిర్చికి గిరాకీ బాగానే ఉంది. శుక్రవారం ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాలు క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.10 వేలు, ఖమ్మంలో రూ.9,300 పలికింది.  

ఖమ్మం మార్కెట్​కు వేలాది క్వింటాళ్లు.. 

ఈసారి వర్షాలకు తోడు నల్లనల్లి, తామర పురుగు ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మిర్చి పంట దెబ్బ తిని దిగుబడి తగ్గింది. దీంతో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్​లో డిమాండ్ పెరిగింది. ఖమ్మం, వరంగల్​తో పాటు ఏపీలోని గుంటూరు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతి అవు తోంది. వారం పది రోజుల నుంచి మార్కెట్లకు మిర్చి రాక మొదలైంది. ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తేజ రకం మిర్చి రోజూ 4 వేల నుంచి 6 వేల క్వింటాళ్ల వరకు వస్తోంది. శుక్రవారం 4,804 క్వింటాళ్లు, గురువారం 5,898 క్వింటాళ్లు, బుధవారం 4,748 క్వింటాళ్లు వచ్చింది.